Breaking News

తమ వాళ్ల కోసం సోషల్‌ మీడియా పోస్టులు

Published on Tue, 09/10/2024 - 06:05

సాక్షి, అమరావతి: పార్టీ వారికి ఉపాధి కోసం ఏ­కం­గా ప్రభుత్వంలో చంద్రబాబు సర్కారు సోష­ల్‌ మీడియా పోస్టులను సృష్టించింది. ప్రభుత్వం నేరుగా ఇటువంటి పోస్టులను సృష్టించి భర్తీ చేయడం ఇదే తొలిసారి. మంత్రుల పేషీల్లో పనిచేయడం కోసం మొత్తం 44 సోషల్‌ మీడియా పోస్టులను సృష్టించడమే కాకుండా వాటిని ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా భర్తీ చేయనుంది. ఈ మేరకు డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిడెట్‌ సోమవారం ఎంప్లాయ్‌మెంట్‌ నోటీసు జారీ చేసింది. 

24 మంది మంత్రుల పేషీల్లో 24 మంది సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్స్‌ను, మరో 24 మంది సోషల్‌ మీడియా అసిస్టెంట్స్‌ను భర్తీచేయనున్నట్లు నోటీసులో పేర్కొంది. ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటీసులో స్పష్టం చేసింది. వ్యక్తిగత ఇంటర్వ్యూ­లు ద్వారా ఎంపిక అంటేనే పార్టీకి చెందిన వారిని తీసుకుంటారని స్పష్టం అవుతోంది. ప్రభుత్వ ఇ­మే­జ్‌ను పెంపొందించాలని, సోషల్‌ మీడియా ఖా­తాలను, సంఘాలను నిర్వహించాల్సి ఉంటుం­­దని, ప్రభుత్వ సందేశాలను, కార్యక్రమాల­ను బలంగా సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి తీ­సుకువెళ్లాల్సి ఉంటుందని నోటీస్‌లో పేర్కొంది.    

వీసీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలకు వైస్‌ చాన్సలర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నత విద్యా కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఈనెల 28వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 10ఏళ్ల పాటు ఆచార్యులు, సంబంధిత స్థా­యిలో అనుభవం గడించిన వారు వైస్‌ చాన్సలర్లు పోస్టుల కోసం దరఖాస్తు­కు అర్హులని తెలిపారు. మూడేళ్ల కాల పరిమితితో భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)