Breaking News

ఇంత మోసమా చంద్రబాబు: వెంకట్రామిరెడ్డి

Published on Sun, 10/19/2025 - 12:39

సాక్షి, విజయవాడ: ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్‌సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి  లేదని.. ఇప్పటివరకు పీఆర్‌సీ కమిషన్‌ అపాయింట్‌ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్‌ బకాయిలు రూ.34 వేల కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు  ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ నిలదీశారు.

‘‘ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్‌ చేయడం లేదు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. మాకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు  ఇవ్వకపోగా పని ఒత్తిడి పెంచారు. ఇంటింటి సర్వేల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది’’ అని  వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక డీఏ ఇవ్వడానికి ప్రభుత్వానికి 16 నెలలు సమయం పట్టింది. తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి’’ అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగులకు బాబు దగా

 

 

 



 

 

 

 

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)