Breaking News

నరక యాతన పడి వ్యాన్‌ డ్రైవర్‌ మృతి

Published on Wed, 10/15/2025 - 10:52

పార్వతీపురం మన్యం జిల్లా: ఐషర్‌ వ్యాన్‌లో ఉన్న గోనె సంచులను అన్‌లోడ్‌ చేసేందుకు వ్యాన్‌కు ఉన్న తాళ్లను విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్‌ బాడీకి–క్యాబిన్‌కు మధ్యలో పడిపోయిన డ్రైవర్‌ రాజు (35) వీరఘట్టం  మెయిన్‌ రోడ్డులో మంగళవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్‌తో పాటు  స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక గోనె సంచుల వ్యాపారికి విజయవాడ నుంచి ఐషర్‌ వ్యాన్‌తో తాడేపల్లి గూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్‌ గోనె సంచులను తీసుకువచ్చాడు. వ్యాన్‌లో ఉన్న గోనె సంచులను అన్‌లోడ్‌ చేసేందుకు గాను కలాసీలు రావడంతో వ్యాన్‌కు ఉన్న కట్లు విప్పేందుకు డ్రైవర్‌ రాజు వ్యాన్‌ పైకి ఎక్కాడు.ఆ తాళ్లు విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్‌ బాడీకి–క్యాబిన్‌కు మధ్యలో ఉన్న సందులో పడిపోయాడు. 

ఈ ప్రమాదంలో డ్రైవర్‌ రాజు  తలకిందులుగా వ్యాన్‌ బాడీకి రేడియేటర్‌కు మధ్యలో ఉండిపోయి నరకయాతన అనుభవించాడు. ఈ ప్రమాదాన్ని చూసిన కలాసీలు, స్థానికులు వెంటనే అతన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న కొందరు మోటార్‌ వర్కర్లు కూడా వచ్చి వ్యాన్‌కు ఉన్న కొన్ని పరికరాలను కోసేసి డ్రైవర్‌ రాజును బయటకు తీయగా కొన్ని గాయాలతో బయట పడ్డాడు. మెల్లగా బయటకు వచ్చి కూర్చున్న డ్రైవర్‌కు కొద్ది క్షణాల్లోనే ఫిట్స్‌ వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 

స్థానికులు సపర్యలు చేసి   పీహెచ్‌సీకి తీసుకువెళ్లగా వైద్యసిబ్బంది తనిఖీ చేసి  చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై ఎస్సై జి.కళాధర్‌ కేసు నమోదు చేశారు. వీరఘట్టం పీహెచ్‌సీలో ఉన్న డ్రైవర్‌ మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. మృతుడి   కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేశామని, వారు వచ్చిన తర్వాత స్టేట్‌మెంట్లు రికార్డు చేసి పోస్ట్‌మార్టం అనంతరం బాడీని అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.

గిలగిలాకొట్టుకోవడంతో కంట తడి  
చుట్టూ వందలాది జనం..రోడ్డు పక్కనే ఉన్న వ్యాన్‌ వద్ద గిలగిలా కొట్టుకుంటూ డ్రైవర్‌ రాజు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. వ్యాన్‌ బాడీకి–క్యాబిన్‌కు మధ్య సుమారు 40 నిమిషాల పాటు ఇరుక్కపోయిన డ్రైవర్‌ రాజు మృత్యువుతో పోరాడి బయటపడ్డాడని అందరూ అనుకున్నారు. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే బయటకు వచ్చిన క్షణాల్లోనే డ్రైవర్‌ చనిపోయాడని తెలియడంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వెంటనే ఈ ప్రమాద విషయాన్ని వ్యాన్‌ యజమానికి ఫోన్‌లో తెలియజేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన రాజు అనే డ్రైవర్‌ విజయవాడ నుంచి ఈ వ్యాన్‌ ఇక్కడికి  తీసుకువచ్చినట్లు వ్యాన్‌ యజమాని పోలీసులకు తెలిపారు.ఈ విషయాన్ని డ్రైవర్‌ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)