Breaking News

గంటా వెంకటేశ్వరరావు అసలు రంగు ఇది

Published on Thu, 05/11/2023 - 17:32

ఎవరికీ తెలియని. పెద్దగా పరిచయమూ లేని వ్యక్తి.  కానీ, ఈనాడు మాత్రం ఆర్థిక మేధావిగా ప్రపంచానికి పరిచయం చేయాలనుకుని బొక్కా బోర్లా పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయనతో జీవీ రావుతో ఓ ప్రకటన చేయించిన రామోజీరావు, దాన్ని ప్రముఖంగా ప్రచురించి హైలెట్‌ చేయాలనుకున్నారు.  కానీ, ప్రజల్లో లేనిపోని అపోహలు తలెత్తక ముందే జగన్‌ సర్కార్‌ అప్రమత్తం అయ్యింది. కీలక గణాంకాలతో యెల్లో మీడియా అవాస్తవాలను ప్రజల ముందు ఉంచడంతో పాటు యెల్లో మీడియా కుట్రను, ఆ కుహనా మేధావి అసలు రంగును బయటపెట్టింది. 

గంటా వెంకటేశ్వర రావు అలియాస్‌ జీవీ రావు..  ఏపీ ఆర్థిక పరిస్థితులపై తప్పుడు విశ్లేషణలకు దిగాడని ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ దువ్వూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే జీవీ రావును గతంలో ఐసీఏఐ(ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా) ఆయన్ని నోటీసులు ఇచ్చి మరీ తొలగించిన విషయాన్ని గుర్తు చేశారాయన. పైగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఐసీఏఐ నోటిఫికేషన్‌లో.. ప్రొఫెషనల్‌ మిస్‌కండక్ట్‌(వృత్తిపరమైన దుషప్రవర్తన) కారణంగా ఘంటా వెంకటేశ్వరరావును రిజిస్టర్‌ మెంబర్‌గా రెండేళ్లపాటు తొలగించడంతో పాటు 50వేల జరిమానా కూడా విధించింది. 

👉 జీవీ రావు వాస్తవానికి ఆర్థిక నిపుణుడు కాదు. వృత్తికి ద్రోహం చేసిన వ్యక్తి. కేవలం సీఎం జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న అనామకుడు. అందుకే అతన్ని ఆర్థిక నిపుణుడి ట్యాగ్‌ లైన్‌ తగిలించి.. ఏపీ ఆర్థిక పరిస్థితి, పాలసీలపై ఈనాడులో తప్పుడు రాతలు రాయిస్తున్నారు. ఆ వేషాలు ఏపాటివో ఏపీ ప్రజలకు తెలియాలి కదా. 

👉 ఈ డ్రామాలో జీవీ రావు కేవలం పాత్రధారి మాత్రమే. రామోజీరావు డైరెక్షన్‌ అయితే.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఆ అసత్యాలను విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి.  ఎంతలా అంటే.. దిగజారిపోయి మరీ ఏపీ శ్రీలంక, పాకిస్థాన్‌లా మారిపోయిందని, అప్పుల పాలయ్యిందనే అభ్యంతరకర ప్రచారాలకు తెర తీశారు.  

👉 సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ వారం లేదా పదిహేను రోజులకోసారి ఏపీలో అప్పులు పెరిగిపోయాయని, ఏదో అయిపోతోందని ఈనాడు చెత్త కథనాలు వండి వార్చుతోంది. ఇలా వార్తలు రాస్తున్నా జనం నమ్మడం లేదని.. కొందరికి మేధావి అంటూ తోక తగిలించి వారితో మాట్లాడిస్తోంది.

👉 వాళ్లేమో తెలుగుదేశం పార్టీ అవసరాలకు అనుగుణంగా మాట్లాడి తమ డొల్లతనాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన జీవీ రావు.. తెలుగుదేశం పార్టీ లైన్‌ మీదే నడిచారు. ఆ పార్టీ సీఎం జగన్‌ సంక్షేమ ప్రభుత్వంపై ఎలాగైతే విమర్శలు చేస్తోందో.. అవే వ్యాఖ్యలు చేశాడు. తద్వారా తన అసలు రంగును ఆయన బయటపెట్టుకున్నారు. 

ఇదీ చదవండి: ఏపీ అప్పులపై క్లారిటీ ఇదిగో

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)