EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి
Breaking News
ఏపీ SIR ముసాయిదా ఓటరు జాబితా విడుదల
Published on Fri, 07/31/2026 - 14:27
సాక్షి, అమరావతి: ఏపీలో సమ్మరీ ఇన్ఫర్మేషన్ రివిజన్ (SIR) ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.71 కోట్ల మంది ఓటర్ల ఎన్యుమరేషన్ పూర్తి చేసినట్లు ఈసీ వెల్లడించింది. అంటే రాష్ట్ర మొత్తం ఓటర్లలో 89.22 శాతం మంది ఫారాలు ఇచ్చినట్లయ్యింది. జాబితా ప్రక్షాళనలో భాగంగా 7.37 లక్షల మంది ఓటర్లకు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు.
15.22 లక్షల మంది ఓటర్లు మృతి చెందినట్టు ప్రకటించగా, 22.30 లక్షల మంది షిఫ్ట్, గైర్హాజరైనట్లు తెలిపింది.అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 44,89,512 మంది ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించాల్సి ఉందని, ప్రస్తుతానికి వారి నుంచి ఫారాలు తీసుకోలేదని ఈసీ స్పష్టం చేసింది.
కాగా, ఓటరు జాబితాలో తప్పులు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం సిబ్బంది (BLOలు) ప్రతి ఇంటికీ తిరిగి, అక్కడ నివసిస్తున్న ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Tags : 1