Breaking News

అందుకే ప్రధానిని కలిశా: ఏపీ సీఎం జగన్‌

Published on Thu, 03/23/2023 - 16:40

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కోసమే తాను ప్రధానిని కలిశానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఏపీ అసెం‍బ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా పోలవరంపై జరిగిన చర్చలో గురువారం ఆయన ప్రసంగించారు. 

టీడీపీ హయాంలో పోలవరం పనులు.. అనాలోచిత నిర్ణయాలతో ముందుకు సాగాయి. ఫలితంగా తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓ పద్ధతి ప్రకారం పనులు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే స్పిల్‌వే.. అప్పర్‌ కాఫర్‌ డ్యాం పూర్తయ్యింది. ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించే పరిస్థితి ఉంది.  ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు కోసమే ప్రధానిని కలిశా. ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం సహాయం కోసమే చర్చించా. తాత్కాలిక పనుల కోసం రూ. 15 వేల కోట్లు అడిగాను అని సీఎం జగన్‌ అసెంబ్లీ ద్వారా తెలిపారు.  

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. డ్యామ్‌ ఎత్తుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. 45.7 మీటర్ల ఎత్తు వరకు డ్యాం నిర్మాణం జరుగుతుంది. సీడబ్ల్యూసీ సిఫార్సుల మేరకు తొలి దశలో 41.15 మీటర్లవరకు కడతాం అని పేర్కొన్నారాయన.  పోలవరంలో ప్రతీ ముంపు కుటుంబానికి గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 10 లక్షల చొప్పున ఇచ్చి తీరతామని సీఎం జగన్‌ మరోసారి ప్రకటించారు.  

అత్యంత ప్రాధాన్యతగా పోలవరం నిర్మాణం చేపడుతున్నామని, పోలవరం పూర్తి చేసేది ముమ్మాటికీ జగనేనని, యెల్లో మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను నమ్మొద్దని మరోసారి  కోరారు సీఎం జగన్‌.

ఇదీ చదవండి: పోలవరం పేరు పలికే అర్హత కూడా చంద్రబాబుకు లేదు

Videos

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)