Breaking News

తిరుమల శ్రీవారి ఆలయంలో వీడియో చిత్రీకరణపై టీటీడీ విచారణ

Published on Mon, 05/08/2023 - 14:27

సాక్షి, తిరుపతి:  తిరుమల శ్రీవారి ఆలయంలో వీడియో రికార్డు చేయడం కలకలం రేపింది. మూడు అంచెల భద్రతను దాటి మరీ ఓ భక్తుడు మొబైల్ ఫోన్‌తో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు. మొబైల్ ఫోన్‌తో వెళ్లిన సదరు భక్తుడు శ్రీవారి ఆలయంలో హల్‌చల్ చేశాడు. ఆలయంలో నలువైపుల నుంచి ఆనంద నిలయాన్ని ఫోన్‌తో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆనంద నిలయం విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

దీని ద్వారా వర్షం పడుతున్న సమయంలో ఆనంద నిలయాన్ని అతి సమీపంలో నుంచి భక్తుడు వీడియో తీసినట్లు తెలుస్తోంది. అయితే భక్తుడు శ్రీవారి ఆలయంలో ఇంకేమైనా చిత్రికరించాడా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై టీటీడీ విచారణ చేపట్టింది. ఆలయం లోపలి సీసీ కెమెరా విజువల్స్‌ను పరిశీలిస్తున్నారు. ని

కాగా శ్రీవారి ఆలయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి మరీ లోనికి అనుమతిస్తుంటారు. సెల్‌ఫోన్, కెమెరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇంత పకడ్భందీగా భద్రత ఉన్నప్పటికీ ఓ భక్తుడు ఈ విధంగా శ్రీవారి ఆలయంలోకి సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లడమే కాకుండా.. ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి ఆలయంలో మొబైల్ ఫోన్‌తో తిరిగినా.. సీసీ కెమెరాల సిబ్బంది గుర్తించని పరిస్థితి నెలకొనడం గమనార్హం. 
చదవండి: మణిపూర్‌ అల్లర్లు.. హైదరాబాద్‌కు తెలుగు విద్యార్థులు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)