Breaking News

భవానీపురం బాధితుల కంటతడి.. వైఎస్‌ జగన్‌ భరోసా

Published on Thu, 12/11/2025 - 14:23

సాక్షి, తాడేపల్లి: అన్యాయంగా తమ ఇళ్లు కూల్చేశారని.. తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని భవానీపురం బాధిత కుటుంబాలు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశాయి. గురువారం పలువురు బాధితులు తాడేపల్లిలో జగన్‌ను కలిసి జరిగిన పరిణామాలను వివరించాయి. 

ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజినగర్‌లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. ఆ సమయంలో కూల్చివేతలు అన్యాయమంటూ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగిపడేసి కూల్చివేతలు జరిపారు. అయితే.. 

తమ ఇళ్ల కూల్చడంపై ఇవాళ జగన్‌ వద్ద బాధిత కుటుంబాలు ఆవేదిన వ్యక్తం చేశాయి. పక్కా రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని పలువురు కంటతడి పెట్టారు. పాతికేళ్లుగా ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొట్టారని పలువురు జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని.. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇచ్చారు. 

భవానిపురం 42 ప్లాట్ల బాధితులకు అండగా వైఎస్ జగన్

‘‘విజయవాడలో అత్యంత దుర్మార్గంగా 42 ఇళ్లను కూల్చారు. బాధితులంతా రోడ్ల మీద ఉన్నారు. ప్రభుత్వ పెద్దలందరినీ బాధితులు కలిశారు. అయినప్పటికీ వారికి కనీస భరోసా కూడా లభించలేదు. కార్పొరేషన్ మీటింగ్ లో దీనిపై నిలదీస్తే ప్రభుత్వం స్పందించలేదు. బాధితులంతా ఇప్పుడు  వైఎస్‌ జగన్‌ని కలిశారు. ఆయన వాళ్ల బాధలు విని సానుకూలంగా స్పందించారు. కావాల్సిన న్యాయ సహాయం అందిస్తామన్నారు’’ అని విజయవాడ వెస్ట్‌ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)