Breaking News

అర్నబ్‌ ఎఫెక్ట్‌.. పలు విమానాలు, రైళ్లు రద్దు

Published on Wed, 10/28/2026 - 08:46

సాక్షి, విజయవాడ: అర్నబ్‌ తుపాను ప్రభావంతో పలు విమానాలు, రైళ్లు రద్దు అయ్యాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు  విమాన రాకపోకలు నిలిచిపోయాయి. మంగళ, బుధవారాల్లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం), రాజమండ్రి విమానాశ్రయం నుంచి పలు సర్వీసులను రద్దు చేశారు. విజయవాడ నుంచి రాకపోకలు సాగించే ఆరు విమానాలను రద్దు చేశారు. కడప, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి గన్నవరానికి నడిచే ఐదు ఇండిగో సర్వీసులను రద్దు చేశారు.

విశాఖ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ రద్దయింది. ఇవాళ (బుధవారం) ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన అన్ని సర్వీస్‌లను రద్దు చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫ్లై 91 హైదరాబాద్‌–విజయవాడ సర్వీసులు, ఎయిర్‌ ఇండియా న్యూఢిల్లీ సర్వీసును రద్దు చేసిన ట్లు ఆ సంస్థలు ప్రకటించాయి. రాజమహేంద్రవరం విమానాశ్రయంలోనూ సర్వీసులను రద్దు చేశారు.

పలు రైళ్లు రద్దు 
రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసి కొన్నింటిని దారి మళ్లించింది. శ్రీకాకుళం రోడ్‌ – చర్లపల్లి (07038), సికింద్రాబాద్‌–హౌరా (12704), సికింద్రాబాద్‌–భువనేశ్వర్‌ (17016), హైదరాబాద్‌–విశాఖపట్నం (12728), మహబూబ్‌నగర్‌–విశాఖపట్నం (12862), లింగంపల్లి–కాకినాడ (12776), లింగంపల్లి–నర్సాపూర్‌ (17256)..

లింగంపల్లి–కాకినాడ (12738), నాందేడ్‌–సంబల్పూర్‌ (20810), చర్లపల్లి–శ్రీకాకుళంరోడ్‌ (07037) రైళ్లను ఈ నెల 27, 28 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నాగర్‌సోల్‌ నుంచి నర్సాపూర్‌ (12788) ట్రైన్‌ను చర్లపల్లి నుంచి నర్సాపూర్‌కు పరిమితం చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి: తుపాన్‌ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వైఎస్‌ జగన్‌

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)