Breaking News

పోలీసులు చిత్రహింసలు పెట్టారు

Published on Sat, 11/08/2025 - 04:03

విజయవాడ లీగల్‌/పెనమలూరు (కృష్ణా జిల్లా): ‘‘నేను ఏ తప్పూ చేయలేదు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టానంటూ పోలీసులు అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. జీపులో తిప్పుతూ, స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు’’ అని ఎన్‌ఆర్‌ఐ మాలేపాటి విజయభాస్కరరెడ్డి శుక్రవారం విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్‌ సివిల్‌ జడ్జి రాధిక ఎదుట వాపోయారు. 

బల్ల మీద పడుకోబెట్టి ఛాతీపై గట్టిగా నొక్కిపట్టి అరికాళ్ల మీద తీవ్రంగా కొట్టారని... ఎస్పీనో, డీఎస్పీనో రావడంతో తన ముఖానికి ముసుగేసి, బూతులు తిడుతూ అరికాళ్లు, చేతులు, తలమీద గట్టిగా కొట్టారని తెలిపారు. బాధతో బిగ్గరగా కేకలు వేస్తున్నా జాలి చూపలేదని, స్టేషన్‌లోని అందరినీ బయటకు పంపి, ఏం చేశావో చెప్పమని అడిగారని, జరిగినది చెప్పినా, మేం చెప్పినట్లు నువ్వు వినాలని బెదిరించారని, ఇతరుల పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారని వెల్లడించారు. 

సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ మంత్రి, వారి కుటుంబసభ్యులపై అసభ్య పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై చోడవరం గ్రామస్థుడు భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన పెనమలూరు పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈయన లండన్‌లో స్థిరపడ్డారు. వారం రోజుల క్రితం తండ్రి మరణించడంతో స్వగ్రామానికి వచ్చారు. కార్యక్రమాలు పూర్తయి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. 

శుక్రవారం కోర్టుకు తరలిస్తున్న సమయంలో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. పోలీసులు తనను కొడుతున్న సమయంలో బాధతో అరిచిఅరిచి గొంతు పోయిందని తెలిపారు. విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేశారని, కోర్టుకు రావడానికి ముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని, పోలీసులు కొట్టారని డాక్టర్‌కు చెప్పినా పట్టించుకోలేదని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. 

కాగా, కోర్టులో విజయభాస్కర్‌ రెడ్డి తరపున న్యాయవాదులు ఒగ్గు గవాస్కర్, కొప్పుల శివరామ్, ఆదాము వాదనలు వినిపించారు. ఆయనపై నమోదైన కేసులన్నీ ఏడేళ్ల లోపు శిక్ష పడేవి అని, కేసులో ఇరికించేందుకే బీఎన్‌ఎస్‌ 111 సెక్షన్‌ చేర్చారని వాదించారు. దీనిప్రకారం పదేళ్లలోపు రెండుసార్లు చార్జిïÙటు నమోదై ఉండాలన్నారు. ఆ సెక్షన్‌.. పిటిషనర్‌కు వర్తించదని చెప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. 

పిటిషనర్‌ ఆరోగ్యం క్షీణించిందని, తక్షణం ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలోగానీ, ఎయిమ్స్‌లో గానీ వైద్యానికి  అనుమతించాలని కోరారు. కాగా భాస్కరరెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. సీఐలు జె.వెంకటరమణ, శివప్రసాద్, ఎస్‌ఐ రమేష్ కు కోర్టు షోకాజ్‌  నోటీసులు జారీ చేసింది. భాస్కరరెడ్డికి స్పెషలిస్ట్‌ వైద్యులతో పరీక్షలు చేయించాలని, ఆ సమయంలో ఫొటోలు తీయాలని, నివేదికను సీల్డ్‌ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)