Breaking News

కమీషన్‌ ఇవ్వకపోతే పింఛన్‌ తీసేస్తాం.. వృద్ధుల పింఛన్లపై కక్కుర్తి

Published on Tue, 12/31/2024 - 12:08

సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో వాలంటీర్‌ వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వృద్దుల పెన్షన్లపై కూడా కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. ఒక్కో పెన్షన్ నుంచి రూ.300 వసూళ్లు చేస్తున్నారు. జమ్మలమడుగు 16వ వార్డులో సచివాలయం సిబ్బంది చేతివాటం బయటపడింది. కమీషన్‌ ఇవ్వకపోతే పెన్షన్ తీసేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. లంచం ఎందుకివ్వాలంటూ పింఛన్‌దారులు ప్రశ్నించినా కూడా సిబ్బంది బలవంతంగా వసూలు చేస్తున్నారు. వ్యవస్థను దారుణంగా దెబ్బ తీసి లంచాలంటూ పెన్షన్ దారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో అర్హతున్న వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. కూటమి మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. అయితే కూటమి అధికారం చేపట్టి ఆరునెలలైనా ఇప్పటివరకు ఒక్క పింఛన్‌ను కూడా చంద్రబాబు సర్కారు మంజూరు చేయలేదు. పైగా అనర్హత పేరుతో ఉన్న పింఛన్లకు కోత విధిస్తోంది. ఫలితంగా పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ పడి భంగపడ్డామని విలపిస్తున్నారు.

ఇదీ చదవండి: రెండెకరాల బాబూ.. వెయ్యి కోట్లు ఎలా సంపాదించావు?

అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లకు కూటమి సర్కారు మంగళం పాడుతోంది. అనర్హుల ఏరివేత పేరిట టీడీపీకి ఓటేయని వారందరినీ నాయకులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏకంగా గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన సామాజిక పెన్షన్లకూ నోటీసులు జారీ చేసి అర్హత నిరూపించుకోవాలని, లేకపోతే అనర్హులుగా ప్రకటిస్తామని రీవెరిఫికేషన్‌ పేరిట ఎంపీడీఓలతో నోటీసులిప్పిస్తున్నారు.
 

 

 



 

Videos

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)