Breaking News

నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని

Published on Sat, 05/11/2024 - 11:14

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య సమన్వయం కొరవడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓటమి దిశగా పయనిస్తోంది. ముఖ్యంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. దీనికి తోడు తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థి రాసలీలల వ్యవహారం సోషల్‌ మీడియాలో బట్టబయలవడంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. జరుగుతున్న పరిణామాలన్నీ రానున్న ఎన్నికల్లో పార్టీ ఓటమికి సంకేతాలుగా ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తమ్ముళ్ల మధ్య అంతరం రోజు రోజుకు పెరుగుతోంది. పోలింగ్‌ తేదీ సమీపించే కొద్దీ నాయకుల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది.  విజయవాడ లోక్‌సభ అభ్యర్థి కేశినేని చిన్ని, విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మధ్య విభేదాలు  పతాక స్థాయికి చేరాయి, ఇద్దరూ కలిసి కనీసం ప్రచారంలో కూడా పాల్గొనటం లేదు. ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఓటర్లకు డబ్బు పంపకాలలో సైతం గద్దె రామ్మోహనరావు, ఎంపీ అభ్యర్థిని పరిగణనలోకి తీసుకోకుండా సొంత మనుషులతోనే పంపకాలు చేస్తున్నారు. 

ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన బొప్పన భవకుమార్‌ సైతం గద్దె వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్నారు. ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంలో ఆయన్ను దూరంగా పెట్టడంతో కినుక వహించారు. గద్దె వ్యవహారం నచ్చక ఆయన అలకబూనారు. దీంతో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి  పార్టీలో ఉన్న సీనియర్లు సైతం గద్దె రామ్మోహన్‌ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఆయనకు ప్రచారంతోపాటు, డబ్బు పంపిణీ కార్యక్రమాల్లో సైతం దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో నిస్తేజం నెలకొంది. నానాటికీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారుతుండటంతో, కొంతమంది నేతలు సైలెంట్‌ అయిపోతున్నారు. ఈ పరిణామాలన్నీ  ఓటమికి సంకేతాలుగా సూచిస్తున్నాయని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పరిస్థితి చేజారిపోయిందని, ఓటమి ఖాయం అనే భావనకు టీడీపీ వర్గాలు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

రాసలీలల రామ్మోహన్‌!

గద్దె అసంతృప్తి సెగలు తాకకుండా... 
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓటర్లు గద్దె పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. తాను ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి గురించి పట్టించుకోలేదని అసంతృప్తితో ఉన్నారు. మాయ మాటలతో ప్రతిసారీ ఎన్నికల్లో మభ్యపెట్టడం, దుష్ప్రచారం చేసి నెట్టుకొస్తున్నాడనే భావన నియోజకవర్గ ఓటర్లలో వ్యక్తం అవుతోంది. దీనికితోడు తాజాగా గద్దె గలీజు బాగోతం  బట్టబయలైంది. ఎన్నో  ఏళ్లుగా సాగుతున్న  ఆయన రాసలీలల వ్యవహారం సోషల్‌ మీడియా వేదికగా వెలుగులోకి రావటం  విజయవాడలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

 ఈయన  నిజస్వరూపం తెలిసి తూర్పు నియోజకవర్గ ప్రజలు ఛీకొడుతున్నారు. దీనికితోడు టీడీపీ ప్రభుత్వ హయంలో కాల్‌మనీ వేధింపుల కేసుల్లో నిందితులు కూడా ఈయన అండతోనే అలా వ్యవహరించారనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు పట్టించుకోలేదని, ఇన్నాళ్లకు గద్దె పాపాలు పండాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల  గద్దె ప్రధాన అనుచరుడు  మహిళలను వేధింపులకు గురి చేసి, దాడి చేయడంతో అతనిపై పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.  ఇప్పుడు ఏకంగా  గద్దె రామ్మోహనరావు వాట్సప్‌ చాటింగ్‌ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో  పడింది. ఇలా పోలింగ్‌ తేదీ సమీపించే కొద్దీ టీడీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 

దీంతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య కోల్డ్‌ వార్‌ సాగుతోంది. వీరిరువురు విడివిడిగా ప్రచారం చేసుకొంటున్నారు. గద్దె రామ్మోహనరావు ఎంపీ అభ్యరి్థకి సహకరించటం లేదు. గత రెండేళ్లు నియోజకవర్గంలో ఏ  పార్టీ కార్యక్రమం జరిగినా తానే ఖర్చు భరించానని, తీరా ఎన్నికల సమయానికి వచ్చేసరికి గద్దె పట్టించుకోకపోవడంతో ఆయన తీరుపై ఎంపీ అభ్యర్థి కారాలు మిరియాలు నూరుతున్నారు.  మొత్తం మీద తూర్పు నియోజక వర్గంలో జరుగుతున్న పరిణామాలన్నీ  ఈసారి ఎన్నికల్లో  ఆ పార్టీ పుట్టి ముంచడం ఖాయం అనే సంకేతాలను ఇస్తున్నాయి.  

రాసలీలల రామ్మోహన్‌!


 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)