Breaking News

‘జగన్‌ సర్‌.. ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు’

Published on Tue, 06/10/2025 - 14:49

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం వచ్చాక తమను పట్టించుకోవడం లేదని, తాము పండించిన పంటలకు గిట్టుబాట ధర ఉండడం లేదని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కోకో, పామాయిల్‌, పొగాకు రైతులు వాపోతున్నారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ(YSRCP) కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరాలతో సహా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 

మేం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది అని రైతులు వైఎస్‌ జగన్‌(YS Jagan) వద్ద వాపోయారు. అయితే ఎవరూ అధైర్యపడొద్దని, రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని ఆయన వాళ్లకు భరోసా ఇచ్చారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడారు. 

నాకు నాలుగెకరాలు పామాయిల్‌ ఉంది, సీజన్‌ ప్రారంభం అయింది, గతంలో సీజన్‌ లేనప్పుడు పామాయిల్‌ టన్ను రూ. 21,400 ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం టన్ను రూ. 18,600 కు వచ్చింది, మాకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి, రైతులకు ఏం మిగలడం లేదు, ఇంకా రేటు తగ్గితే మేం పూర్తిగా నష్టపోతాం, దయచేసి ప్రభుత్వం కనీసం టన్నుకు రూ. 20,000 మద్దతు ధర అయినా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మేం మా సమస్యను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చాం. ఆయన తప్పక మాకు అండగా ఉంటామన్నారు.
::అన్నవరపు గణేష్‌, రైతు, రావికంపాడు, చింతలపూడి నియోజకవర్గం, ఏలూరు జిల్లా

మేం కోకో రైతులం. జగన్‌ను కలిసి మా సమస్యను వివరించాం, కోకోను ప్రైవేట్‌ కంపెనీలు గతంలో కేజీ రూ. 1,000 కి కొనుగోలు చేశాయి, కానీ ఇప్పుడు మాత్రం కేజీ రూ. 750 సీజన్‌ ప్రారంభంలో ఇచ్చి ఇప్పుడు రూ. 400 ఇస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం కేజీ రూ. 850 అమ్ముతుంటే ఇక్కడ మాత్రం సిండికేట్‌ అయి రూ. 300-400 మధ్య కొనుగోలు చేస్తున్నారు. పైగా టీడీపీ రైతుల(TDP Farmers) దగ్గరే కొంటున్నారు. మేం వైఎస్సార్సీపీ సానుభూతిపరులమని మా దగ్గర కొనడం లేదు. ఇవన్నీ జగన్‌ గారికి చెప్పాం.  

వైఎస్ జగన్ ను కలిసిన ఏలూరు కోకో రైతులు

పైగా నిరుడు రేట్‌ పలికిందని ఈ ఏడు కౌలు రేట్లు కూడా పెంచడంతో మేం తీవ్రంగా నష్టపోతున్నాం. మా రైతులంతా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఇలాగైతే మా రైతులు ఏమవ్వాలి, మా సమస్యలు విని వైఎస్సార్‌సీపీ రైతులకు అండగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసానిచ్చారు.
::తాతా రవి, రైతు, బాదరాల గ్రామం, ఏలూరు జిల్లా

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)