Breaking News

సిఎం చంద్రబాబు సొంత జిల్లాలో దివ్యాంగులకు కరువైన రక్షణ

Published on Sun, 07/19/2026 - 23:00

సాక్షి, చిత్తూరు: సిఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో దివ్యాంగులకు రక్షణ కరువైంది. చిత్తూరు జిల్లాలో దివ్యాంగులపై జరిగిన దాడి ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐరాల మండలం ఎర్రిపల్లి పంచాయితీ కంపల్లె గ్రామంలో ఈనెల 8న దివ్యాంగురాలు సుమతిపై రాజేంద్ర రెడ్డి విచక్షణారహితంగా దాడి చేసిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

ఈ ఘటన 48 సెంట్ల స్థల వివాదం నేపథ్యంలో చోటుచేసుకుంది. తహశీల్దార్ పోలీసు బందోబస్తు ఇవ్వమని కోరినా పట్టించుకోకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. బాధితురాలు సుమతి దివ్యాంగుల జె.ఏ.సి ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు కాగా, తోటి దివ్యాంగురాలు విజయకు జరుగుతున్న అన్యాయంపై మద్దతుగా వచ్చిన ప్రతినిధుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది.  

ఐరాల పోలీస్‌ స్టేషన్‌లో దివ్యాంగుల జె.ఏ.సి ప్రతినిధులు ఫిర్యాదు చేసినప్పటికీ, ఈనెల 11న రాజేంద్ర రెడ్డి ఫిర్యాదు ఆధారంగా 8 మంది దివ్యాంగులపై కేసు నమోదు చేయడం బాధితులను మరింత కలవరపెట్టింది. రేపు(సోమవారం) దివ్యాంగుల జె.ఏ.సి ప్రతినిధులు చిత్తూరు జిల్లా ఎస్పీని కలవనున్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో దివ్యాంగులకు రక్షణ లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. జరిగిన ఘటనకు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)