Breaking News

పింఛన్లు, రేషన్‌ కోసం.. కుటుంబాలు విడిపోతున్నాయి

Published on Mon, 03/09/2026 - 05:36

సాక్షి, అమరావతి: పింఛన్లు, రేషన్‌ కోసం కుటుంబాలు విడిపోతున్నాయని.. దీనిని నివారించేందుకు కొత్త విధానం తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చే లబ్ధి చిన్న కుటుంబాలకు కాకుండా పెద్ద కుటుంబాలకే ఇస్తానని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధానిలో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. కుటుంబమే మనకు ఒక భద్రత అన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. 

ఇద్దరు, ము­గ్గురు పిల్ల­లుంటే మహిళలకు మాదిరి­గానే పురుషులకు కూడా రెండునెలల వరకు సెలవు ఇస్తానని తెలిపారు. ఒకప్పుడు ముగ్గురు పిల్లలను కనొద్దని చెప్పిన తానే ఇప్పుడు రాష్ట్రంలో జనాభా తగ్గుదల నేపథ్యంలో ‘ముగ్గురు పిల్లలు ముద్దు’ అంటూ ఫ్యామిలీ మ్యానేజ్‌మెంట్‌ అంటున్నానన్నారు. ‘రాబోయే పదేళ్లు నేను చెప్పింది వినండి, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండకపోతే అప్పుడు నన్నడగండి’.. అంటూ వ్యాఖ్యానించారు. బాబు ఇంకా ఏమన్నారంటే..

సెర్ప్, మెప్మాను ఒకే గొడుగు కిందకు తెస్తా..
మా పార్టీ అధికారంలో లేనప్పుడు ఆయా ప్రభుత్వా­లు పొదుపు సంఘాలను పట్టించుకోలేదు. బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను 99.89 శాతం తిరిగి కట్టే వ్యవస్థ డ్వాక్రా వ్యవస్థే. రాబోయే రోజుల్లో మెప్మా, డ్వాక్రా (సెర్ప్‌) రెండింటిని వెలుగు అనే ఒక గొడుగు కిందకు తెస్తా. పొదుపు సంఘాల మహిళలు తయారుచేసే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేలా  స్వయం పేరుతో ఒక బ్రాండ్‌ను ప్రారంభించా. ఈ ఏడాది మహిళల్లోనే లక్షల మంది పారిశ్రామికవేత్తలు తయారయ్యారు.  

మీకేదైనా అయితే నాకు ఫోను చేయండి.. 
ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మన దగ్గర పెట్రో­ల్, గ్యాస్‌ రేట్లు పెరిగే పరిస్థితి ఉంది. ఓపెన్‌ మార్కెట్‌లో సిలిండర్‌ ధరలు పెరిగినా.. మా ఆడబిడ్డలకు నేను ఇచ్చే 3 సిలిండర్లు ఉచితంగానే ఇ­స్తా. ఐదేళ్లు గంజాయి బ్యాచ్‌లను తయారుచేశా­రు. ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయింది. మీకేదైనా జరిగితే నాకు ఫోన్‌ చేయండి. ఎవడైనా  సరే.. తాటతీస్తా. ఇక ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాలకు రూ.10,100 కోట్ల రుణాల చెక్కును సీఎం చంద్రబాబు అందజేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)