Breaking News

సంక్షోభాలు, తుపాన్లు వస్తే అమెరికా మనలా ఎదుర్కోలేదు

Published on Fri, 10/31/2025 - 05:25

సాక్షి, అమరావతి: ఉపగ్రహ చిత్రాలతో మోంథా తుపాన్‌ పరిస్థితిని అంచనా వేశామని, భారీవర్షాలు, గాలుల తీవ్రతపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని టెక్నాలజీలను అనుసంధానించి రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌లో మోంథా కదలికలను పసిగట్టామని, తద్వారా వర్షాలు పడే గ్రామాలను ముందే గుర్తించామని తెలిపారు. కానీ, వర్షాలు అక్కడ కాకుండా వేరేచోట కురిశాయన్నారు. ఓ విధంగా మోంథా దాగుడుమూతలు ఆడిందన్నారు. 

తుపాన్‌ను టెక్నాలజీ సాయంతో ఎలా ఎదుర్కొన్నామనే అంశాన్ని గురువారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు వివరించారు. ‘‘మెరికాలో సంక్షోభం వస్తే మేనేజ్‌ చేయలేరు. తుపాన్లు వచ్చినా ఎదుర్కోలేరు. మనం 16 నెలల్లో టెక్నాలజీ వ్యవస్థను తయారు చేశాం. దానిని వినియోగించి అద్భుతంగా ఎదుర్కోగలిగాం. ఏ రిజర్వాయర్లో, ఏ చెరువులో ఎంత నీరుందో గుర్తించాం. 

ఎక్కడెక్కడ పెద్దఎత్తున ప్రవాహాలు వస్తాయో ఊహించి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేశాం. మరణాలు, ఆస్తి నష్టం బాగా తగ్గించాం. వరద నీటితో పాటు పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాం. గతంలో తుపాన్‌ ప్రభావం తగ్గిన వారం రోజుల వరకు కోలుకునే పరిస్థితి ఉండేది కాదు’’ అని వివరించారు. ‘‘మోంథా బీభత్సం సృష్టించింది. కాకినాడ దగ్గర ఊహిస్తే వేరేచోట తీరం దాటింది. ఇక్కడినుంచి తెలంగాణ వెళ్లింది. 

వరంగల్‌లో ఒకేసారి 43 సెంటీమీటర్లు వర్షం పడింది. రాష్ట్రంలో మోంథా కారణంగా రూ.5,265.51 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. పూర్తిస్థాయిలో అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపిస్తాం’’ అని తెలిపారు. పంటలకు రూ.829 కోట్లు, ఉద్యాన రంగంలో రూ.39 కోట్లు, సెరీకల్చర్‌కు రూ.65 కోట్లు, ఆక్వా రంగంలో రూ.1,270 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.2,079 కోట్లు, మున్సిపల్‌ శాఖలో రూ.109 కోట్లు, జల వనరుల విభాగంలో రూ.207 కోట్లు, పంచాయతీరాజ్‌ రూ.8 కోట్లు, విద్యుత్‌ శాఖ రూ.16 కోట్లు, పశుసంవర్ధక శాఖలో రూ.71 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 120 పశువులు చనిపోయాయని తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఎదురుచూసే వారి కోసం రూపొందించిన ‘నైపుణ్యం’ పోర్టల్‌ ఉద్యోగాల గేట్‌ వేగా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి నెల, ప్రతి నియోజకవర్గంలో జాబ్‌ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు.

వరి తినేవారు ఉండరు..
టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య రంగంలో రూ.4, 5 వేల కోట్లు, సాగు నీటి  ఎత్తిపోతల విద్యుత్‌ చార్జీల్లో రూ.8 వేల కోట్ల బడ్జెట్‌ తగ్గిస్తామని చంద్రబాబు తెలిపారు. ‘‘ఉపగ్రహం ద్వారా పంట ఉత్పత్తి అంచనా వేస్తాం. దానిప్రకారం మార్కెటింగ్‌ చేసుకునే అవకాశం ఉంది. రైతులు ఖరీఫ్, రబీలోనూ వరి పంటనే వేస్తున్నారు. వరి తినేవారు ఉండరు. డిమాండ్‌ ఉన్న పంటలు వేస్తేనే లాభసాటి. ఈ ఖరీఫ్‌లో 37 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాం’’ అని పేర్కొన్నారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)