Breaking News

చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం

Published on Fri, 01/17/2025 - 06:44

చిత్తూరు,  సాక్షి: జిల్లా శివారు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్‌ను తప్పించబోయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 22 మందికి గాయాలయ్యాయి.

చిత్తూరు శివారులో గంగాసాగరం(Gangasagaram) వద్ద అర్ధరాత్రి 2 గం. సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తచ్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఓ టిప్పర్  అక్కడ ఆగి ఉంది. అదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travel Bus).. ఆ టిప్పర్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీ కొట్టి పడిపోయింది. బస్సు తిరుపతి నుంచి మధురైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న  జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్(Sumit Kumar) ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. సీఎంసీ వేలూరు ఆసుపత్రి కి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

గంగసాగరం సమీపంలోని గాజుల పల్లి ఫ్లై ఓవర్ వద్ద టిప్పర్ లారీ వేగంగా ప్రవేట్ బస్సు ఢీ కొట్టడం తో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు తిరుపతి నుంచి మధురైకు వెళ్తోంది. రంగనాధన్ ఇన్ ట్రావెల్స్ బస్సు ఇది. నలుగురు స్పాట్‌లో చనిపోయారు. విషమంగా ఉన్న ఆరుగురిని చీలాపల్లి సి.ఏం.సి ఆసుపత్రి కు తలించాం. మిగిలిన వారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
:::శ్రీనివాసరావు, చిత్తూరు రూరల్ సీఐ

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)