Breaking News

తిరుమల నడక మార్గంలో బాలు​డిపై చిరుత దాడి

Published on Thu, 06/22/2023 - 22:32

తిరుమల: తిరుమల నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఓ చిరుత పులి బాలు​డిపై దాడి చేసింది. తన తాతతో కలిసి అక‍్కడే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలు​డి మెడ పట్టుకుని ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. 

వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరు­గులు తీశారు. టార్చ్‌లు వేస్తూ, రాళ్లు విసరడంతో 7వ మైలు కంట్రోల్‌ రూం వద్ద చిరుత బాలు​డిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది. చిరుత దాడి నుంచి బాబును అక్కడి భద్రతా సిబ్బంది రక్షించినట్టు సమాచారం.

గాయాల పాలైన బాలు​డిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని ప్రాంతాల్లో చిరుత దంతపు గాయాలయ్యాయి.  అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన బాలు​డు కర్నూలు జిల్లా ఆదోని వాసి కౌషిక్‌(3)గా గుర్తింపు. 

జరిగిన విషయం తెలియడంతో టిటిడి ఈవో ధర్మారెడ్డి బాలు​డిని పరామర్శించారు. బాలు​డికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ధర్మారెడ్డి సూచించారు.

చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతామన్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.  స్విమ్స్‌కు చెందిన  న్యూరో స్పెషలిస్ట్లు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారని ధర్మారెడ్డి పేర్కొన్నారు.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)