Breaking News

సీఐడీ అధికారుల ఎదుట లొంగిపోయిన చంద్రబాబు 

Published on Sun, 01/14/2024 - 04:09

సాక్షి, అమరావతి/ నగరంపాలెం: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌లో అక్రమాలు, మద్యం కొనుగోళ్లలో అక్రమాలు, ఉచిత ఇసుక దోపిడీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు సీఐడీ అధికారుల ఎదు­ట శనివారం లొంగిపోయారు. ఆ కేసుల్లో ముం­దస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పూచీ కత్తులు సమ ర్పించారు. ఈ మూడు కేసుల్లో హైకోర్టు చంద్రబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసుల్లో దర్యాప్తు అధికారుల ఎదుట లొంగిపోయి ఒక్కో కేసులో ఇద్దరు పూచీకత్తుతో పాటు రూ.లక్ష చొప్పున ష్యూరిటీ బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ కోసం దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు హాజరుకావాలని కూడా పేర్కొంది. ఆ మేరకు హైదరా­బాద్‌ నుంచి గన్నవరం చేరుకున్న బాబు పార్టీ నేతలతో కలసి ముం­దుగా విజయవాడ తులసీనగర్‌లోని సీఐడీ ప్రాం­తీయ కార్యాలయానికి వెళ్లారు. ఇసుక కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్‌ కోసం పూచీకత్తులు సమ ర్పించారు.

అనంతరం తాడేç­³ల్లిలోని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కార్యాలయానికి వెళ్లారు. ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌లో అక్రమాల కేసులో ముందస్తు బెయిల్‌కు అవసరమైన పూచీకత్తులు సమ ర్పించారు. చివరిగా గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్న బాబు మద్యం కుంభకోణం కేసులో పూచీకత్తులు సమర్పించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ శ్రీనరేష్‌ కూడా ముందస్తు బెయిల్‌కోసం పూచీకత్తులు సమర్పించారు.  

స్పందించని కేడర్‌ 
బాబు రాకను పురస్కరించుకుని అందరూ సీఐ­డీ కార్యాలయానికి రావాలని తెలుగుదేశం గ్రూపుల్లో నిన్నటి నుంచి మెస్సేజులు పెట్టినా కేడర్‌ స్పందించలేదు. చంద్రబాబు కారుని సీఐడీ కార్యాలయంలోకి అనుమతించగా, కొంతమంది తెలుగు తమ్ముళ్లు ఆకారుతో లోనికి వెళ్లేందుకు పోటీపడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టేశారు. యువత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొద్దిసేపు గలాటా స్పష్టించారు. చంద్రబాబు రాకను కవర్‌ చేసేందుకు వచ్చిన సాక్షి మీడియాపై టీడీపీ నేతలు దుర్బాషలాడుతూ.. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గొడవ చేశారు. 

బాబుకు నిరసన సెగ 
కంకిపాడు: పెనమలూరు సీటు సెగ టీడీపీ అధినేత చంద్రబాబుకే నేరుగా తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం కృష్ణాజిల్లా తాడిగడపలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో పెనమలూరు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బోడే ప్రసాద్‌ అనుచరులు నిరసనకు దిగారు. పెనమలూరు టికెట్‌ బోడే ప్రసాద్‌కే ఇవ్వాలని సీఐడీ కార్యాలయం వద్ద బారికేడ్లను తోసుకుంటూ వెళ్లి ప్రసాద్‌కు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)