Breaking News

గోవిందా.. ఏమిటీ అపచారాలు?

Published on Sun, 01/19/2025 - 03:03

సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల, తిరుపతిలో వరుసగా జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి. తిరుమలేశుని భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ స్వయంగా సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవోనే పెద్ద అభాండం వేశారు. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో పంది కొవ్వు కలిసిందంటూ జరిగిందంటూ కోట్లాది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందించి సీబీఐ అధికారులతో సిట్‌ ఏర్పాటు చేసింది.

ఈ ఘటన జరిగినప్పటి నుంచి తిరుమల తిరుపతిలో వరుస సంఘటలు అధకార కూటమి నేతలు చేసిన తప్పులకు పర్యావసానమేనని భక్తులు, స్థానికులు అంటున్నారు. ఇటీవల తిరుపతి క్యూలైన్‌లో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందడం సహా పలు జరగరాని ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం తిరుమలలో కొందరు భక్తులు ఎగ్‌ పలావ్‌ని కొండపైకే తెచ్చి, అక్కడే తినడం మరింత కలకలం రేపింది. ఈ వరుస అపచారాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట 
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధార్మిక క్షేత్రం తిరుమలకు నిత్యం లక్షలాది భక్తులు వస్తుంటారు. అయి­నా ఒక చిన్న అవాంఛనయ సంఘటన కూడా జరిగిన దాఖలాలు లేవు. క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌లో టీటీడీకి ఉన్నంత పటిష్టమైన ప్రణాళికలు దేశంలో ఎక్కడా లేవు. అందుకే 9 నెలల క్రితం అయోధ్య రామాలయం ట్రస్ట్‌ నిర్వాహకులు తిరుమలలోని క్యూలైన్‌ వ్యవస్థను పరిశీలించి, టీటీడీ అధికారులతో చర్చించి వెళ్లారు. అనంతరం టీటీడీ ఇంజినీరింగ్‌ నిపుణులు అయోధ్యకు వెళ్లి అక్కడి వారికి శిక్షణ ఇచ్చి వచ్చారు కూడా. అంతటి సమర్ధవంతమైన వ్యవస్థ ఉన్న తిరుమలలో కూటమి ప్రభు­త్వం స్వార్ధపూరిత చర్యలకు దిగింది. దాని పర్యవసానమే ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం క్యూలైన్‌లో తొక్కిసలాట. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. 

ఎందుకింత నిర్లక్ష్యం? 
తొక్కిసలాట ఘటన మరువక ముందే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం  కౌంటర్‌ లో షార్ట్‌ సర్కూట్‌తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో కౌంటర్లు, క్యూలలో వేలాది భక్తులు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ కౌంటర్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత తిరుమల రెండో ఘాట్‌ రోడ్‌ వద్ద ఆర్టీసి బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తుల్లో 15 మందికి పైగా గాయపడ్డారు. రెండు రోజుల క్రితం తిరుమల పద్మనాభం యాత్రిక సదన్‌ పైనుంచి మూడేళ్ల బాలుడు జారిపడి మృతి చెందాడు.

గత ఆదివారం పరకామణిలో 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ని చోరీ చేస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అంతకు ముందు ఇదే వ్యక్తి పరకామణిలో మరిన్ని దొంగతనాలకు పాల్పడినట్టు విచారణలో తేలినట్లు తెలిసింది. అదే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో భక్తులను మోసం చేస్తున్న ఐదుగురిని పట్టుకున్నారు. తిరుమల ఆలయంపై తరచూ విమానాలు చక్కర్లు కొట్టడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇంకోపక్క తిరుమల పాపవినాశం పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఎర్రచందనం చెట్లను నరికి యథేచ్ఛగా తరలిస్తున్న విషయం బయటపడింది. ఇలా తరలిస్తున్న వారిలో కొందరిని టాస్‌్కఫోర్స్‌ సిబ్బంది పట్టుకున్నారు. శనివారం తమిళనాడుకు చెందిన 18 మంది భక్తులు  ఎగ్‌ పలావ్‌ తో తిరుమల కొండ పైకి వచ్చే­శారు. తిరుపతిలోనే పూర్తిగా తనిఖీ చేసి పంపే పెద్ద వ్యవస్థ ఉన్నా కూడా వీరు నిషేధిత ఆహార పదార్థాలతో తిరుమలకు చేరుకోవడం, శ్రీవారి ఆలయానికి అతి సమీపంలోని రాంబగీచ వద్దే ఆరగించడం అందరినీ విస్తుగొలిపింది.

ఆ ప్రాణాలకు ఇచ్చే విలువ ఇంతేనా? 
వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టికెట్లు జారీకి సరైన ఏర్పాట్లు చేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఆ ఫలితమే భైరాగిపట్టెడ పద్మావతి పార్క్, శ్రీనివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు ప్రభుత్వం, టీటీడీ భక్తుల ప్రాణాలకు ఇచ్చే విలువేమిటో ఇక్కడే వెల్లడైంది. చనిపోయిన భక్తుల కుటుంబాలకు టీటీడీ రూ.­25 లక్షలు చొప్పున మాత్రమే పరిహారం చెల్లించింది.  ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలే­దు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌ గ్రేషియా, ప్రతి కుటుంబానికి టీటీడీలో ఉద్యోగం ఇవ్వాలని పలు పారీ్టలు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం, టీటీడీ పట్టించుకోడంలేదు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)