Breaking News

గ్రీన్‌చానెల్‌ ద్వారా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి

Published on Tue, 10/28/2025 - 05:11

నరసరావుపేట: ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌చానెల్‌ ఏర్పాటుచేసి దాని ద్వారా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు నెల­కు రూ.300 కోట్లు చొప్పున కేటాయించాలని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా కార్యని­ర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు. అలా­గే, ఆరో­గ్య­శ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సమాఖ్య ప్రతినిధులతో ఆ శాఖ మంత్రి చర్చలు జరిపి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్లను మరుగుపర్చేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యశ్రీని నీరుగాస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్‌ పేరు ఇప్పటికీ ప్రతి పేదవాడి గుండెలో చిరస్థాయిగా ఉండడానికి కారణం ఆ­రోగ్యశ్రీ అన్నారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారానే లభించిందని, తద్వారా అనేకమంది పేదలు ప్రాణాలు దక్కించుకున్నారని గుర్తుచేశారు. గోపిరెడ్డి ఏమన్నారంటే.. 
నెట్‌వర్క్‌ ఆస్పత్రులను

చర్చలకు పిలవడం లేదు.. 
ఏ ప్రభుత్వం వచి్చనా ఆరోగ్యశ్రీని తీసి­వేసే ధైర్యం చేయట్లేదంటే ఈ పథకం ప్రజల్లోకి ఎంతగా వెళ్లిందో అర్థం చేసుకోవాలి. వైఎ­స్సార్‌ హయాంలో 1,700 జబ్బులకు ఆరోగ్య­శ్రీ ద్వా­రా వైద్యసేవలు అందజేస్తే వైఎస్‌ జగన్‌ పాలన­లో 3,007 జబ్బులను ఈ పథకం కిందకు తీసుకొచ్చారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఖ్యనూ 900 నుంచి రెండు వేలకు పెంచి పరిమితిని కూడా రూ.5 లక్షల రూ.25 లక్షలకు పెంచారు. వైఎస్సార్, జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్న అక్కసుతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్విర్యం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రూ.3 వేల కోట్లు బకాయిలు పెట్టింది.

దీనివల్ల మొ­న్న­­టి దాకా 9వేల ఆపరేషన్లు జరిగితే ఆ సంఖ్య ఇప్పుడు మూడువేలకు తగ్గింది. అవి కూడా ప్ర­­భు­త్వాసుపత్రులు, మెడికల్‌ కాలేజీల్లోనే జరుగుతున్నాయి. 18 రోజుల నుంచి నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మె చేస్తుంటే ఆ ప్రతినిధులను చర్చలకు కూడా పిలవడంలే­దు.  104, 108 సేవలను గ­తంలో అరబిందో, జీవి­కే లాంటి సంస్థలు నిర్వహించా­యి. ఇప్పుడీ సేవలను రూ.5 కోట్ల ట­ర్నో­వర్‌ కూడా లేని టీడీపీ డాక్టర్ల సంఘం అ­ధ్య­క్షుని కంపెనీకి కట్టబెట్టి ఆ వ్యవస్థ­నూ భ్రష్టుపట్టిస్తున్నారు. ఏడాదిన్నరలో రూ.2 లక్షల కో­ట్లు అప్పుచేసిన ఈ ప్రభుత్వం ఆ డ­బ్బు­ను ప్ర­జా­రోగ్యం మీద ఎందుకు ఖర్చుచేయడంలేదు.? 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)