ఈ లైనింగ్‌ దండుకునేందుకే!

Published on Mon, 07/14/2025 - 05:03

ఈ ఫొటోలో కనిపిస్తున్నది శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి సమీపంలోని కమ్మవారిపల్లి వద్ద హంద్రీృనీవా రెండో దశ ప్రధాన కాలువ 340 కిలోమీటర్ల నుంచి 341 కిలోమీటర్ల మధ్య స్టీల్‌ ఫైబర్‌ రీయిన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ (ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) విధానంలో వేసిన లైనింగ్‌. చిన్న చిన్న ఇనుప తీగలు, సిమెంటు, సిలికా, ఇసుక, కంకర, నీటితో కలిపి ఎస్‌ఎఫ్‌ఆర్‌సీని తయారు చేస్తారు. కాలువకు రాతి పొర ఉన్న ప్రదేశంలో మాత్రమే.. కాలువ సైడ్‌ స్లోప్స్‌ (ఏటవాలు ప్రాంతం) క్రమానుగతంగా ఉండేలా సరిచేసుకుని (సెక్షనింగ్‌ చేసి), ఆ తర్వాత 38 మిల్లీమీటర్ల (ఎంఎం) మందంతో ఒకసారి, ఆ తర్వాత 38 ఎంఎం మందంతో మరోసారి అధిక ఒత్తిడితో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్‌ చేయాలి. కానీ, మట్టి పొరకే.. అదీ కాలువ సైడ్‌ స్లోప్స్‌ క్రమానుగతంగా ఉండేలా చేయకుండానే, వాలు ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ 10 నుంచి 20 ఎంఎం మందంతో మాత్రమే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్‌ చేస్తున్నారు. 


ఇంత అడ్డదిడ్డంగా లైనింగ్‌ చేసిన దాఖలాలు ఎక్కడా లేవని.. లైనింగ్‌ పనుల్లో ఇదో వింత అని ఇంజినీరింగ్‌ అధికార వర్గాలు అభివర్ణిస్తున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా, కాలువకు కనిష్ఠ స్థాయిలో నీటిని విడుదల చేసినా.. ఈ లైనింగ్‌ ఎక్కడికక్కడ జారిపోవడం ఖాయమని.. భారీ ఎత్తున ప్రజా ధనం వృథా కావడం తథ్యమని తేల్చి చెబుతున్నారు. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ బీఎస్సార్‌ ఇన్‌ఫ్రా మేనిజింగ్‌ డైరెక్టర్‌ బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. దాంతో పనులు నిబంధనలకు విరుద్ధంగా, నాసిరకంగా చేస్తున్నా ప్రశ్నించడానికి వాటిని పర్యవేక్షిస్తున్న ఇంజినీరింగ్‌ అధికారులు సాహసించలేక పోతుండటం గమనార్హం. ఫలితంగా ప్రవాహ వేగం, ప్రవాహ సామర్థ్యం పెంచాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది.  

హంద్రీృనీవా కాలువ లైనింగ్‌ పనుల్లో జరుగుతోన్న అక్రమాలకు ఇదో మచ్చుతునక. రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్‌ కాలువ, కుప్పం బ్రాంచ్‌ కాలువ లైనింగ్‌ పనులను కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేస్తూ అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. టెండర్‌ నిబంధనల ప్రకారం రాతి పొర, డీప్‌ కట్‌ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే షార్ట్‌ క్రీటింగ్‌ విధానంలో లైనింగ్‌ చేయాలి. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి పని స్వభావం (స్కోప్‌ ఆఫ్‌ వర్క్‌) మార్చేసి.. పనులు వేగంగా పూర్తి చేయాలనే సాకు చూపి.. అడ్డగోలుగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్‌ చేస్తున్నారు. షార్ట్‌ క్రీటింగ్‌ పద్ధతిలో లైనింగ్‌ చేస్తే చదరపు మీటర్‌కు రూ.1,407 చొప్పున బిల్లు చెల్లిస్తారు. అదే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్‌ చేస్తే రూ.1,854 చెల్లిస్తారు. కానీ.. హంద్రీృనీవా పనుల్లో మాత్రం రూ.2,400 చొప్పున బిల్లులు చెల్లిస్తుండటంపై ఇంజినీరింగ్‌ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

సాక్షి, అమరావతి/పుట్టపర్తి: హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ ప్రధాన కాలువ, దానిలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌(పీబీసీ), కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ (కేబీసీ) లైనింగ్‌ పనుల్లో నాణ్యత ఎంత అంటే నేతి బీరలో నెయ్యంతే! టెండర్‌లో అధిక ధరకు అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్ప­గించిన ముఖ్యనేత.. ఆ కాంట్రాక్టు విలువలో పది శాతం రూ.196.89 కోట్లను మొబిలైజేషన్‌ అడ్వా­న్సుగా చెల్లించి.. నీకింత నాకింత అంటూ పంచుకు­తిన్నారు. 

ఆ తర్వాత ఆ పనులను కాంట్రాక్టర్లు ని­బంధనలు తుంగలో తొక్కి నాసిరకం పనులు చేస్తు­న్నా,అధికారులు ప్రశ్నించలేక­పోతున్నారు. కా­ర­ణం..ఆ కాంట్రాక్టర్లకు సీఎం చంద్రబాబు అండదండ­లు ఉండటమేనని చెబుతున్నా­రు. భారీ వ­ర్షం వచ్చి­నా, సామర్థ్యం మేరకు కాలువ­కు నీటిని విడుదల చేసినా నాసిరకంగా చేసిన లైనింగ్‌ కొట్టు­కుపోవడం ఖాయమని నిపుణులు చెబుతు­న్నారు. కాలువకు సిమెంట్‌ లైనింగ్‌ను రైతులు వ్యతి­రేకించినా, సీఎం పట్టించుకోలేదు. 

హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216.30 కి.మీ నుంచి 400–500 కి.మీ వరకు 5 ప్యాకేజీలుగా విభజించి, ఆర్నెళ్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధనతో రూ.972.19 కోట్లతో (రూ.520.75 కోట్ల విలువైన 3 ప్యాకేజీల పనులు ‘ఈనాడు’ కిరణ్‌ సోదరు­డి వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌కు.. రూ.451.44 కోట్ల విలువైన 2 ప్యాకేజీల పనులు చంద్రబాబు సన్నిహి­తుడికి చెందిన బీఎస్సా­ర్‌ ఇన్‌ఫ్రాకు) అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్ప­గించారు. 

పుంగనూరు బ్రాంచ్‌ కాలువలో 0–75­­వ కి.మీ వరకు పనులను 2 ప్యాకేజీల కింద విభజించి, ఆర్నెళ్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధనతో కళ్యా­ణ­దుర్గం టీడీపీ ఎమ్మె­ల్యే సురేంద్ర­బాబుకు చెందిన ఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.­319.6 కోట్లతో అప్ప­గించారు. పుంగనూరు బ్రాంచ్‌ కాలువలో 75 కి.మీ నుంచి 207.80 కి.మీ వరకు పనులను రూ.480.22 కోట్ల­తో ఆర్నెళ్లలో పూర్తి చేయాలనే నిబంధనతో సీఎం చంద్ర­బాబు సన్నిహి­తునికి చెందిన ఎన్‌సీసీ సంస్థకు నామి­నేషన్‌ పద్ధతి­లో కట్టబెట్టారు. కుప్పం బ్రాంచ్‌ కాలు­వ లైనింగ్‌ పనులను సీఎం చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడైన బీజేపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.196.91 కోట్లతో అప్పగించారు.

రూ.602 కోట్లు వెచ్చించి ఉంటే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి 
హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్‌ కాలువ, కుప్పం బ్రాంచ్‌ కాలువ లైనింగ్‌ పనులను రూ.1,968.92 కోట్లతో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. ఇష్టారాజ్యంగా పనులు చేస్తుండటం వల్ల.. చిన్న పాటి వర్షం కురిసినా.. కాలువలో కనిష్ఠ స్థాయిలో ప్రవాహం ఉన్నా లైనింగ్‌ ఎక్కడిక­క్కడ జారిపోవడం ఖాయమని.. దాని కోసం వెచ్చించిన ధనమంతా వృథా అవుతుందని జ­ల వనరుల శాఖలో సుదీర్ఘ కాలం సేవ­లు అందించి, పదవీ విరమణ చేసిన చీఫ్‌ ఇంజినీర్‌ ఒకరు చెప్పారు. 

లైనింగ్‌ చేస్తే భూగర్భ జల మట్టం అడుగంటిపోతుందని.. బోరు, బావులు ఎండిపోతే.. ఏళ్ల కొద్దీ సాగు చేస్తున్న పండ్ల తో­టలు ఎండిపోతా­యని రైతులు ఆందోళన వ్య­క్తం చేస్తుండ­టాన్ని ఆయన ఎత్తిచూపారు. రైతు­ల ఆవేద­నను అర్థం చేసుకుని, లైనింగ్‌ చేయ­కుండా పిల్ల కాలువలు తవ్వ­­డా­­నికి రూ.602 కోట్లు వెచ్చించి ఉంటే.. హంద్రీ–నీవా తొలి ద­శ, రెండో దశ కింద 6.02 లక్షల ఎకరాలకు నీ­ళ్లందించే అవకాశం ఉండేదని మరో రిటైర్డు చీఫ్‌ ఇంజినీర్‌ చెప్పా­రు. ఆయకట్టుకు నీళ్లందించి ఉంటే రైతుల జీవన ప్రమాణాలు పెరిగే­వ­ని.. హంద్రీ–నీవా లక్ష్యం సాకారమయ్యే­దన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ లైనింగ్‌ 
టెండర్‌ నిబంధనల ప్రకారం రాతి పొర ఉన్న చోట్ల మాత్రమే షార్ట్‌ క్రీటింగ్‌ విధానంలో లైనింగ్‌ చేయాలి. నిబంధనల్లో ఎక్కడా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ ప్రస్తావనే లేదు. టెండర్‌ పేర్కొన్న దానికి భిన్నంగా పని స్వభావం మారితే స్టేట్‌ లెవల్‌ టెక్నికల్‌ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదం పొంది.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ.. టెండర్‌లో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే సాకు చూపి, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానాన్ని కాంట్రాక్టర్లు ప్రతిపాదిస్తే ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీరింగ్‌ అధికారులు నోరు మెదపలేక పోయారని జల వనరుల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. రాతి పొర లేకున్నా.. మట్టి పొరకే.. కనీసం కాలువ సైడ్‌ వాలు (స్లోప్‌)ను క్రమానుగతంగా సరి చేయకుండానే ఇష్టారాజ్యాంగా అత్తెసరు మందంతో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో కాంట్రాక్టర్లు లైనింగ్‌ పనులు కానిచ్చేస్తున్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు చేసుకుంటూ ముఖ్య నేతతో కలిసి దోచుకు­తింటున్నారు.

లైనింగ్‌ పనులు జరుగుతున్నది ఇలా..
⇒ ఇన్‌క్లెయిన్‌డ్‌ రోలర్‌తో కాలువ ఇరు వైపులా అడు­గు భాగాన్ని గట్టి పరచకుండా పొక్లెయిన్‌ బకెట్‌తో తూతూ మంత్రంగా పనులు కానిచ్చేస్తున్నారు. దాంతో మట్టి ఎక్కడికక్కడ జారిపోతోంది.  

⇒ గతంలో కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని, రాళ్లను గట్టుగా పోశారు. ఆ గట్లపై ఉన్న రాళ్ల నుంచే ఇప్పుడు కంకర తయారు చేస్తున్నారు. ఆ కంకర పిండి పిండిగా నాసిరకంగా ఉంది. సమీపంలో వా­గు­లు, వంకల్లో నుంచి ఇసుకను తెస్తున్నారు. నాసిరకం కంకర, ఇసుక.. తక్కువ పరిమాణంలో సి­మెంటుతో ఎం–25 మిక్సర్‌ (ఒక పాలు సిమెంటు, ఒక పాలు ఇసుక, రెండు పాళ్లు 20 ఎంఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం), ఎం–20 (1 పాలు సిమెంటు, 1.5 పాళ్లు ఇసుక, 3 పాళ్లు 12 ఎం ఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం) మిక్సర్‌ తయారు చేస్తున్నారు.  

⇒ కాలువకు ఇరువైపులా మట్టి జారిపోతున్నా పేవర్‌ యంత్రాన్ని వినియోగించకుండా.. కార్మీకుల ద్వారా సిమెంట్‌ కాంక్రీట్‌తో లైనింగ్‌ చేస్తున్నారు. మట్టిజారిపోతున్నా సరే అలానే లైనింగ్‌ వేస్తున్నారు. దీని వల్ల లైనింగ్‌ ఎక్కువ కాలం నిలబడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎం–25, ఎం–20 కాంక్రీట్‌లో సిమెంటు తక్కువగా, ఇసుక ఎక్కువగా, నాసిరకం కంకర వినియోగించడం వల్ల లైనింగ్‌ చేసిన ప్రాంతాల్లో ఇసుక పైకి తేలి స్పష్టంగా కనిపిస్తోంది.  

⇒ క్షేత్ర స్థాయిలో అధికారులు పనులను సక్రమంగా పర్యవేక్షించడం లేదు. కొంత మంది అధికారులు పనులు పర్యవేక్షిస్తున్నా, నాసిరకంగా ఇష్టారాజ్యంగా సబ్‌ కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నా పట్టించుకోవ­డం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే.. వాళ్లు పెద్ద కాంట్రా­క్టర్లు.. వాళ్లను ప్రశ్నిస్తే మా ఉద్యోగాలు పోతా­యని తన పేరును బహిర్గతం చేయొద్దంటూ ఓ ఉ­న్న­తాధికారి ‘సాక్షి’తో వాపోయారు. నాణ్యత, ని­యంత్రణ విభాగం అధికారులు ఆ పనుల వైపు క­న్నెత్తి చూడటం లేదనే విమర్శలు  వినిపిస్తున్నాయి. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)