Breaking News

రాజధాని అప్పుల్లో రూ.991.06 కోట్లు మళ్లింపు

Published on Mon, 07/07/2025 - 03:14

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), హడ్కో (హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నుంచి తెచ్చిన అప్పులో రూ.991.06 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. ఈ నిధులను రాజధాని నిర్మాణ పనుల కోసం అప్పుగా ఇచ్చామని.. వాటిని నిర్మాణ పనులకే వ్యయం చేయాలని.. ఇతర పనులకు మళ్లించకూడదని ఆ బ్యాంకులు ముందే షరతులు విధించాయి. 

ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ మళ్లించిన నిధులను తక్షణమే సీఆర్‌డీఏ ఖాతాలో జమచేయాలని కమిషనర్‌ కె. కన్నబాబును ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో అధికారులు ఆదేశించారు. ఇదే అంశాన్ని ఆయన ఆరి్థక శాఖకు చెబుతూ వస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ విడతల వారీగా  రూ.245.37 కోట్లను ప్రభుత్వం జమచేసింది. ఇంకా రూ.745.69 కోట్లను జమచేయలేదు.  

‘పోలవరం’ నిధులు కూడా.. 
ఇలా రాజధాని నిర్మాణం కోసం అప్పుతెచ్చిన నిధులనే కాదు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను కూడా ఎస్‌ఎన్‌ఏ (సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ) ఖాతాలో జమచేయకుండా ప్రభుత్వం ఇదే రీతిలో ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. గత అక్టోబరు 9న పోలవరం ప్రాజెక్టుకు తొలివిడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,348 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లించేసింది. 

ఇది తెలిసి కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తంచేయడంతో చివరికి జనవరి రెండో వారంలో వాటిని ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. దాంతో నిర్వాసితులకు పరిహారం, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు, సేకరించిన భూమికి పరిహారం పంపిణీ చేశారు. 



అలాగే, మార్చి 12న పోలవరం ప్రాజెక్టుకు రెండో విడతగా కేంద్రం విడుదల చేసిన అడ్వాన్సులో రూ.2,704.81 కోట్లలో రూ.2,504.81 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇతర అవసరాలకు పక్కదారి పట్టించింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, సేకరించాల్సిన భూమికి పరిహారం, చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి మాత్రమే వినియోగించాల్సిన అడ్వాన్సు నిధులను మళ్లీ దారి మళ్లించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.    

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)