Breaking News

భారతి సిమెంట్స్‌పై బాబు సర్కారు కక్ష సాధింపు

Published on Sun, 11/23/2025 - 04:23

సాక్షి, అమరావతి: భారతి సిమెంట్స్‌ కంపెనీపై సీఎం చంద్రబాబు కక్ష సాధింపునకు దిగడంపై పారిశ్రామిక వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నేతలపై ఇష్టానుసారం తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్న బాబు ప్రభుత్వం.. మరో అడుగు ముందుకు వేసి భారతి సిమెంట్‌ కంపెనీ లీజులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వాటి రద్దుకు సన్నాహాలు చేస్తోంది.

లీజులు రద్దు చేస్తున్నారంటూ తన కరపత్రిక ఈనాడుకు లీకులు ఇచ్చి కథనాలు రాయిస్తోంది. వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం మండలంలో భారతి సిమెంట్స్‌ కంపెనీకి 509.18 ఎకరాలు, ఎర్రగుంట్ల మండలంలో 235.56 ఎకరాలు గతంలోనే లీజులు మంజూరయ్యాయి. తప్పుడు ఆరోపణలతో ఈ లీజులను రద్దు చేసి, దెబ్బ కొట్టాలని చంద్రబాబు కుట్ర పన్నారు. ఇందుకోసం అధికారంలోకి రాగానే 15 ఏళ్లకుపైగా సుదీర్ఘ చట్టపరమైన, పరిపాలనా ప్రక్రియలు పూర్తయిన తర్వాత పొందిన లీజులపై ఎటువంటి కారణం లేకుండానే విచారణకు ఆదేశించారు.

ఆ నివేదికను తనకు కావాల్సిన విధంగా తయారు చేయించుకుని, తద్వారా భారతి సిమెంట్స్‌ కంపెనీకి త్వరలో నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు టీడీపీ కరపత్రికలో శనివారం కథనం రాయించారు. నోటీసులకు కంపెనీ వివరణ ఇచ్చిన తర్వాత.. ఆ వివరణ ఎలా ఉన్నప్పటికీ, సున్నపురాయి లీజులు రద్దు చేస్తారంటూ సదరు పత్రికకు లీకులిచ్చారు. వివరణతో సంబంధం లేకుండా లీజులు రద్దు చేస్తారని చెప్పడం ద్వారా చంద్రబాబు వాటి రద్దుకు కంకణం కట్టుకున్నారని స్పష్టమవుతోంది. 

అది 20 ఏళ్ల క్రితం కొన్న ప్రైవేటు భూమి 
నిజానికి సున్నపురాయి లీజులు ఉన్న ఆ భూమిని 20 ఏళ్ల క్రితం ఆ కంపెనీ కొనుగోలు చేసింది. ఇప్పుడు లీజులు రద్దు చేస్తే, ఆ భూమి కంపెనీది కాకుండా పోతుందా? అని నిపుణులు ప్రశి్నస్తున్నారు. పరిశ్రమలు వస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, కానీ ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తే పరిశ్రమలు ఎలా వస్తాయని పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

వ్యూహాత్మకంగా భారతి సిమెంట్స్‌ లీజు మాత్రమే కాకుండా రామ్‌కో, ఏసీసీకి లీజులను కూడా రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని ప్రచారం చేసుకుంటూ మరోవైపు ఉన్న పరిశ్రమలపై రాజకీయ కక్ష సాధింపులకు దిగడం చంద్రబాబుకే చెల్లిందని, ఇలాగైతే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)