Breaking News

రైతులను మళ్లీ నట్టేట ముంచిన చంద్రబాబు సర్కారు

Published on Sat, 12/13/2025 - 07:51

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు పంటల బీమా వర్తింపజేయకుండా నిండా ముంచేశారు. దీంతో పంటలు కోల్పోయిన రైతులకు బీమా రాలేదు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ సభ్యుడు పరిమళ్‌ నత్వానీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్‌నాథ్‌ ఠాకూర్‌ ఇచ్చిన సమాధానంలో ఈ విషయం స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 3.77 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు రాష్ట్రం నుంచి నివేదిక అందినట్లు మంత్రి తెలిపారు. 

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రాష్ట్రంలో రైతులకు ఎటువంటి బీమా పరిహారం చెల్లించలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఎంఎఫ్‌బీవై కింద తన వాటాను చెల్లించలేదని తెలిపారు. పైగా ఈ ఏడాది ఖరీఫ్‌లో పీఎంఎఫ్‌బీవై–పునర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద ఏపీలో కేవలం 5.3 లక్షలమంది రైతులు మాత్రమే నమోదైనట్లు చెప్పా­రు. ఈ నమోదైన రైతులకు కూడా ఎటువంటి బీమా క్లెయిమ్‌లను చెల్లించలేదని స్పష్టం చేశారు. గత వైఎస్సా­ర్‌సీపీ ప్రభుత్వం రైతుల కోసం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. 


చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేశారు. రైతులే తమ పంటలకు బీమా చేసుకోవాలనే ధోరణిలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించింది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో రాష్ట్రంలో కేవలం 5.3 లక్షలమంది రైతులే బీమా కింద నమోదయ్యారు. అదే 2023­–24లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖరీఫ్‌లోనే ఏకంగా 30.09 లక్షలమంది రైతులకు చెందిన 50.63 లక్షల ఎకరాల్లోని పంటలకు బీమా సౌకర్యం కల్పించింది. చంద్రబాబు నిర్వాకం కారణంగా కేవలం 5.3 లక్షలమంది రైతులకే బీమా పరిమితం కాగా.. రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం వాటా చెల్లించకపోవడంతో వారి పంటలకు కేంద్ర బీమా పరిహారం చెల్లించలేదు.  

Videos

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు