క్షతగాత్రులకు అందని పరిహారం.. చంద్రబాబు సర్కార్‌ వైఫల్యం

Published on Sat, 08/24/2024 - 18:29

సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం ప్రమాద ఘటనలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నష్ట పరిహారం అందించడంలో చంద్రబాబు సర్కార్‌  వైఫల్యం చెందింది. ఇద్దరు క్షతగాత్రులకు నష్టపరిహారం అందలేదు. ప్రమాదంలో కెమిస్ట్ తేజేశ్వరరావు కంటి చూపు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రొడక్షన్ మేనేజర్ నరేష్ కూడా పరిహారం అందలేదు. ప్రస్తుతం ఆయన ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరో ఘటనలో పరవాడ సినర్జీస్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇండస్ ఆసుపత్రిలో నలుగురు చికిత్స పొందుతుండగా.. జార్ఖండ్‌కు చెందిన రొయ్య అంగీర మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీ్‌హెచ్‌ మార్చూరీకి తరలించారు.

కాగా, ‘అచ్యుతాపురం–పరవాడ’ సెజ్‌లో వరుస ప్రమాదాలు కార్మికులు, వారి కుటుంబాలను భయాందోళనలకు గురి చేస్తు­న్నాయి. రెండు నెలల వ్యవధిలో జరిగిన ఏడు ప్రమాదాల్లో 22 మంది మృతిచెందారు. రెండు రోజుల కిందట అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో 17 మంది మరణించిన దుర్ఘటన మరువక ముందే... పరవాడ సెజ్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది.

పరవాడ సమీపంలోని జేఎన్‌ ఫార్మాసిటీలో సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రేడియంట్స్‌–3 యూనిట్‌లో గురువారం అర్ధరాత్రి రియాక్టరు నుంచి రసాయనాలు వెలువడి పొగతో కూడిన మంటలు వ్యా­పించాయి. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు, విజయనగరం జిల్లాకు చెందిన ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన విశాఖపట్నంలోని ఇండస్‌ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

TDP ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఇంకా అందని నష్టపరిహారం

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)