Breaking News

99 పైసలకే 27.10 ఎకరాలు.. ఉత్తర్వులు జారీ

Published on Thu, 11/13/2025 - 07:39

సాక్షి, అమరావతి: రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ కె.రహేజా రియల్‌ ఎస్టేట్‌ గ్రూపునకు విశాఖలో ఎకరం 99 పైసలకు 27.10 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మధురవాడలోని ఐటీ హిల్‌ నంబర్‌–3లో 27.10 ఎకరాలను ఏపీ ల్యాండ్‌ ఇన్సింటివ్స్‌ ఫర్‌ టెక్‌ హబ్స్‌ (లిఫ్ట్‌) పాలసీ ప్రకారం కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతోపాటు రూ.91.2 కోట్లతో రహదారులను కూడా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపింది.

అనకాపల్లి వద్ద రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనున్న బ్రూవరేజస్‌ ప్లాంట్‌ కోసం ఎకరం రూ.40 లక్షల చొప్పున 30 ఎకరాలను కేటాయించింది. రూ.744 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్‌కు రూ.330.52 కోట్ల టైలర్‌ మేడ్‌ రాయితీలను ప్రకటించింది. అనంతపురంలో రూ.1,274 కోట్లతో ఏర్పాటు చేయనున్న సుగుణ స్పాంజ్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ప్రత్యేక రాయితీలు, రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న ఎపిటోమ్‌ కాంపోనెంట్‌కు 19.06 ఎకరాలు, కుప్పంలో ఎన్‌పీఎస్‌పీఎల్‌కు 130 ఎకరా­లు, ఐస్పేస్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 2 ఎకరాలు, ఫ్లూయెంట్‌ గ్రిడ్‌ రూ.150 కోట్ల పెట్టుబడులు, క్రేయాన్‌ టెక్నాలజీ రూ.1,079 కోట్లు, మదర్సన్‌ టెక్నాలజీకి రూ.109.73 కోట్లతో మధురవాడలో ఐటీ క్యాంపస్, ఉప్పాడలో కాకినాడ వద్ద రూ.44,000 కోట్లతో 1 మిలియన్‌ గ్రీన్‌ అల్యూమినియం స్మెల్టర్‌ ప్రాజెక్టులకు పలు రాయితీలు, ప్రోత్సహకాలు ఇస్తూ పలు ఉత్వరులు విడుదలయ్యాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)