Breaking News

పత్తి రైతు ‘ఫైర్‌’

Published on Tue, 11/18/2025 - 04:48

ప్రత్తిపాడు: మోంథా తుపాను పత్తి రైతును ఆగమాగం చేసేసింది. పైకి పైరు పచ్చగా కళకళలాడుతున్నట్లు కనిపిస్తున్నా, భూమి లోపల మొక్కల వేర్లు కుళ్లి పోవడంతో క్రమేపీ మొక్క నశించిపోతోంది. అయినా ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. కడుపు మండిన కర్షకుడు సాగు చేసిన పత్తి పైరును పీకేసి నిప్పు పెడుతున్నాడు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడుకు చెందిన కమ్మ సురేష్ బాబు ఏడు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. ఎకరాకు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. తుపాను తరువాత వేర్లు కుళ్లిపోయి పంట కృశించిపోయింది.

పత్తి తీతలు తీస్తే ఎకరాకు 50 నుంచి 60 కిలోలు మాత్రమే వచ్చింది. దీంతో ఇక లాభం లేదనుకున్న రైతు సోమవారం కూలీలను పెట్టి పత్తి మొక్కలను పీకేశాడు. వాటిని కుప్పలుగా పోసి పొలంలోనే నిప్పుపెట్టాడు. తానూ టీడీపీ మనిషినేనని, 30 ఏళ్లుగా సభ్యత్వం ఉందని, అయినా చంద్రబాబు సర్కారు పంట నష్టపరిహారం అందించడం లేదని విమర్శించాడు.

ఏ అధికారీ పొలాన్ని పరిశీలించలేదని,  పరిహారం ఇస్తున్నామంటూ టీవీల్లో ఘనంగా చెప్పుకుంటున్న సర్కారు పొలంలోనే తగలబడిపోతున్న ఈ పత్తి పంటకు ఏం సమాధానం చెబుతుందని నిలదీశాడు. కనీసం సగం రాయితీపైన అయినా విత్తనాలను అందించాలని డిమాండ్‌ చేశాడు. తమ గ్రామంలో అందరూ దాదాపుగా పంటను పీకేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.  

పత్తిపైరును పీకేసి పొలంలోనే నిప్పుపెట్టిన దృశ్యం(ఇన్‌సెట్‌) రైతు సురేష్‌బాబు   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)