Breaking News

గ్రామ, సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్‌ షాక్‌

Published on Sun, 01/26/2025 - 09:44

సాక్షి, విజయవాడ: గణతంత్ర దినోత్సవం వేళ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్‌ బిగ్‌ షాక్ ఇచ్చింది. సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సచివాలయాలను కేటగిరులుగా విభజించి ఉద్యోగులను కుదిరించింది.

గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ కూటమి సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాకిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 40 వేల ఉద్యోగుల సంఖ్యకు చంద్రబాబు సర్కార్‌ కోతపెట్టింది. సచివాలయ ఉద్యోగులకు క్రమబద్దీకరణకు ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం.

ఇక, ఇదే సమయంలో సచివాలయాలను ఏ, బీ, సీ కేటగిరిగా విభజించింది. ఈ క్రమంలో ఏ-కేటగిరి సచివాలయాల్లో సిబ్బందిని ఆరుకి కుదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే, బీ-కేటగిరి సచివాలయంలో సిబ్బందిని ఏడుకి కుదించారు. సీ-కేటగిరి సచివాలయంలో సిబ్బంది ఎనిమిదికి కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, ఉద్యోగాల్లో భారీగా కోత విధించారు.

ఇదిలా ఉండగా.. అంతకుముందు రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మూడు కేటగిరీలుగా వర్గీకరించాలని తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని ఏపీ గ్రామ, సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల అర్లయ్య ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుని అమలు చేసే ముందు ఉద్యోగ సంఘాల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు వివిధ రూపాల్లో కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు.

ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగుల వర్గీకరణకు సంబంధించి మార్గదర్శకాల కోసం ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేస్తామన్న కమిటీని నియమించారా లేదా, ఏర్పాటై ఉంటే అందులో సభ్యులుగా ఎవరెవరు ఉన్నారనే దానిపై కూడా ఉద్యోగులు, నేతలకు సమాచారం లేదన్నారు. తమ విభాగంలో చేపట్టనున్న మార్పులు, చేర్పులపై ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ అంశంపై ప్రభుత్వంతోపాటు సంబంధిత మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)