వైఎస్సార్‌సీపీలో చేరికలకు కూటమి అడ్డంకులు

Published on Tue, 12/23/2025 - 05:57

సాక్షి, విశాఖపట్నం: పోలీసులను అడ్డుపెట్టుకొని వైఎస్సార్‌సీపీపై చంద్రబాబు సర్కార్‌ కుట్రలు చేస్తోంది. సోమవారం విశాఖలోని సిరిపురం సమీపంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనాలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీలో చేరికల కార్యక్రమాన్ని అడ్డుకుంది. చేరికల కార్యక్రమం నిర్వహణకు వీఎంఆర్‌డీఏకు వైఎస్సార్‌సీపీ రూ.71,300 చెల్లించి అధికారికంగా అనుమతి తీసుకుంది. ఈ కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు, పార్టీ నేతలు వుడా చిల్డ్రన్స్‌ థియేటర్‌ వద్దకు చేరుకోగా.. దీన్ని చూసి ఓర్వలేకపోయిన కూటమి నేతలు ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు, చిల్డ్రన్స్‌ ఎరీనా సిబ్బందితో గేటుకు తాళం వేయించారు.

దీన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో చి్రల్డన్‌ థియేటర్‌ గేటు వద్ద మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు తదితరులు నిరసన తెలిపారు. అనంతరం గేటు వద్ద నగర ప్రముఖుడు ధర్మాన ఆనంద్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన 1,400 మంది కార్యకర్తలకు కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)