Breaking News

దావోస్‌లో ఒప్పందాలు చేసుకోరు.. చర్చిస్తారు

Published on Tue, 01/28/2025 - 10:33

మహారాణిపేట (విశాఖ): సీఎం చంద్రబాబు 1997 నుంచి దావోస్‌కు వెళ్తున్నారని, అక్కడ ఎప్పుడూ ఒప్పందాలు చేసుకోరని, చర్చించి వారి ఆసక్తిని బట్టి ఒప్పందాలు చేసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. ఓ కోర్టు కేసు నిమిత్తం సోమవారం విశాఖపట్నం వచ్చిన ఆయన కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. 

వైఎస్సార్‌సీపీలో ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారని.. చట్టాన్ని ఉల్లంఘించిన నేతలు, అధికారులను వదిలిపెట్టేదిలేదని స్పష్టంచేశారు.  కాకినాడ పోర్టును అడ్డగోలుగా తుపాకీ పెట్టి లాక్కున్నారని చెప్పారు. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ పకడ్బందీగా చేయాల్సి ఉన్నందున ఒక్కొక్కటిగా చేస్తున్నామన్నారు. ఈ ఏడు నెలల కూటమి ప్రభుత్వ హయాంలో రూ.6,33,568 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. 4,10,128 మందికి ఉద్యోగాలు వస్తాయని లోకేశ్‌ తెలిపారు. 

స్థిరమైన ప్రభుత్వంవల్లే పెట్టుబడులు 
ఇక మహారాష్ట్ర, గుజరాత్‌లలో స్థిరమైన ప్రభుత్వం ఉండడంవల్లే వారికి పెట్టుబడులు వస్తున్నాయని, స్థిరమైన ప్రభుత్వంవల్ల పారిశ్రామికవేత్తల్లో ఆత్మవిశ్వాసం నెలకొంటుందని చెప్పారు. జగన్‌ మళ్లీ రాడని పారిశ్రామికవేత్తలు గ్యారంటీ అడుగుతున్నారని మంత్రి లోకేశ్‌ చెప్పారు.  దావోస్‌లో కాగ్నిజెంట్ ను వారి పెవిలియన్‌కు వెళ్లి కలిశానని, త్వరలోనే ఉత్తరాంధ్రకు మంచి న్యూస్‌ వస్తుందన్నారు.  మరో 90 రోజుల్లో టీసీఎస్‌ వస్తుందని చెప్పారు.     కాలేజీల యాజమాన్యాలకే విద్యాదీవెన నిధులు చెల్లిస్తామన్నారు.  ఇక చంద్రబాబు ఏ బాధ్యతలిచ్చినా అహర్నశలు కష్టపడి పనిచేస్తానని, పార్టీకి చెడ్డపేరు మాత్రం తీసుకురానని లోకేశ్‌ చెప్పారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)