Breaking News

పోసాని రిలీజ్‌ అడ్డుకునే కుట్ర.. ఎల్లో మీడియాలో హింట్‌!

Published on Wed, 03/12/2025 - 08:05

కర్నూలు, సాక్షి: వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం ఫలితంగా.. కూటమి కక్ష సాధింపు చర్యల నుంచి నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట దక్కింది. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్‌ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి  ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్‌ పడింది. 

సోషల్‌ మీడియాలో అనుచిత పోస్ట్‌ పెట్టారంటూ పోసానిపై 5 నెలల కిందట ఏపీ సీఐడీ(AP CID) కేసు నమోదు చేసింది. తాజా కేసుల నుంచి ఊరటతో ఆయన జైలు నుంచి విడుదల కాబోతుండగా.. హఠాత్తుగా ఆ కేసును తెరపైకి తెచ్చారు. ఆఘమేఘాల మీద గుంటూరు కోర్టులో సీఐడీ పీటీ వారెంట్‌ దాఖలు చేయగా.. కోర్టు సీఐడీ విజ్ఞప్తికి అనుమతించింది. 

దీంతో.. ఈ ఉదయం సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం. జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట ప్రవేశపెడతారని తెలుస్తోంది.  పోసానిపై సీఐడీ నమోదు చేసిన కేసు వివరాలు తెలియాల్సి ఉంది. 

పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్‌ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు. 

అయితే చివరకు.. న్యాయమే గెలిచింది.  బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్‌ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.

  • అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్‌

  • పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్‌

  • ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్‌లో కేసు.. బెయిల్‌

  • కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్‌  

  • హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్‌ 

మరోవైపు.. పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం తన అనుకూల మీడియా ద్వారా విషం చిమ్ముతోంది. ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొందంటూ ముందుగానే కథనాలు ఇచ్చేసింది. పోసానిపై పలుచోట్ల కేసులున్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యే లోపు, ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్‌ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చంటూ పేర్కొనగా.. ఈలోపే సీఐడీ ఆయన విడుదలను అడ్డుకునేందుకు తెర మీదకు రావడం గమనార్హం.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)