తిరుమల లడ్డూపై సీబీఐ సంచలన రిపోర్ట్

Published on Wed, 01/28/2026 - 20:55

సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తులో​ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సప్లయ్‌ చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం గుజరాత్‌లోని నేషనల్‌ డెయిరీ డవలప్‌మెంట్‌ బోర్డు(NDDB) ద్వారా నెయ్యి శాంపిల్స్‌ను సీబీఐ మరోసారి పరీక్షించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టత ఇస్తూ ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ ఇచ్చిందని సీబీఐ వెల్లడించింది. సీబీఐ దర్యాప్తుతో టీడీపీ, పచ్చ మీడియా ప్రచారాలు తప్పని అని తేలింది.

తిరుమల లడ్డూపై సీబీఐ ఇచ్చిన సంచలన రిపోర్ట్‌.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు చెంపపెట్టులా మారింది. చంద్రబాబు, పవన్‌లు చేసింది తప్పుడు ప్రచారమేనని నిర్థారణ అయ్యింది. సీబీఐ రిపోర్ట్‌తో చంద్రబాబు అబద్ధాల పుట్ట బద్ధలైంది. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన చంద్రబాబు, పవన్‌.. రాజకీయ దురుద్ధేశంతోనే లడ్డూపై  దుష్ప్రచారం చేశారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.

తిరుమల లడ్డూపై విషం చిమ్మిన కూటమికి దిమ్మతిరిగేలా సీబీఐ నివేదిక ఇచ్చింది. 2024లో జూలై 6న టీటీడీ సేకరించిన శాంపిల్స్‌లో మిగిలి ఉన్న శాంపిల్స్‌ మరోసారి పరీక్షించాలని 2025 జనవరి 8న ఎన్‌డీడీబీకి సీబీఐ లేఖ రాసింది. గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి 2025 మార్చి 27న ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ ఇచ్చింది.

 

 

 

 

 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)