Breaking News

పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?: బుగ్గన

Published on Mon, 11/04/2024 - 16:33

హైదరాబాద్‌, సాక్షి: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.  

‘‘పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?. 2005లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. వైఎస్సార్‌ హయాంలో ప్రాజెక్టుకు అనుమతులు తీసుకున్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కేంద్రం పోలవరం బాధ్యతలు తీసుకుంది. పోలవరం పూర్తైతే గ్రావిటీ  ద్వారా కృష్ణా డెల్టాకు నీరు వస్తుంది. పోలవరం ఆపేసి చంద్రబాబు  పట్టిసీమ ఎందుకు కట్టారు?. 

..ఆనాడు కేంద్రంతో టీడీపీ  చేసుకున్న ఒప్పందంతో ఎన్నో ఇబ్బందులున్నాయి. 2013 భూసేకరణ చట్టాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. మా ప్రభుత్వ హయాంలో పోలవరం ముఖ్యమైన పనులు పూర్తిచేశాం. వైఎస్సార్‌సీపీ హయాంలో కోవిడ్‌ కాలంలోనూ పోలవలం పనులు చేశాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు. 

..పోలవరం ఎత్తు తగ్గింపు మా హయాంలోనే జరిగిందని టీడీపీ తప్పడు ప్రచారం చేస్తోంది. ఏపీ ఇరిగేషన్‌ మంత్రి నిమ్మల రాయానాయుడు తప్పడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ చేసిన తప్పిదాలును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సరిదిద్దింది. కోవిడ్‌ సంక్షోభం లేకుంటే మిగిలిన పనలు పూర్తి చేసేవాళ్లం. స్పిల్‌ వే కట్టిన తర్వాత అప్పర్‌  కాఫర్‌, లోయర్‌ కాఫర్‌ డ్యాం కట్టాలి. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే డయాఫ్రంవాల్‌ కట్టాలి. ప్రతీ సోమవారం పోలవరం అని చంద్రబాబు భ్రష్టుపట్టించారు’’ అని అ‍న్నారు.

హోంమంత్రి అనితపై పవన్‌ చేసిన వ్యాఖ్యలపై బుగ్గన రియాక్షన్‌..
‘‘డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎవరిని ప్రశ్నిస్తున్నారు?. పవన్‌ కూడా ప్రభుత్వంలోనే  ఉన్నారు కదా?. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా ఇంకా ప్రశ్నించడమేనా? మీరు ఉపముఖ్య మంత్రి కూడా. మీరు కూటమికి కారణం కూడా.  మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు. ఈరోజు మళ్లీ హోమ్ మినిస్టర్‌ను ప్రశ్నిస్తున్నారు. మరి మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నట్లు మిమ్మల్ని మీరే ప్రశ్నిచుకుంటున్నారా?. 

మీ ప్రభుత్వం వచ్చాక క్రైం జరుగుతున్నా.. మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారో అర్ధం కావట్లేదు.  మీరు అధికారంలో ఉండికూడా ప్రశ్నిచడం ఏమిటి?.  సమాధానం చెప్పాల్సిన మీరు హోమ్ మినిస్టర్‌ను ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు పాలనాపైన ఓరియెంటేషన్ అవసరం ఉంది. అదృశ్యమైన 30 వేల మంది  ఆడపిల్లల జాడేదీ?. ’’అని అన్నారు.

పోలవరంపై ఇంకెన్ని అబద్దాలు చెప్తావ్ బాబూ..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)