Breaking News

రైతులకు సంఘీభావంగా బుగ్గన పాదయాత్ర

Published on Tue, 12/02/2025 - 16:09

సాక్షి, నంద్యాల జిల్లా: రైతుల పక్షాన మరో పోరాటానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. రైతులకు సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పాదయాత్ర చేపట్టారు. అరటికి గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్యాపిలి మండలంలో క్షేత్రస్థాయిలో అరటి పంటలను బుగ్గన పరిశీలించారు.

హుసేనాపురం నుంచి డి.రంగాపురం వరకు ఆయన పాదయాత్ర చేపట్టారు. ప్యాపిలీ మండలంలో దాదాపు 4వేల ఎకరాల్లో రైతులు అరటి సాగు చేస్తుండగా.. గిట్టుబాటు ధరలేక గెలలను పొలాల్లోనే వదిలేస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బుగ్గన రాజేంద్రనాథ్‌ డిమాండ్‌ చేశారు.

‘‘మొక్క జొన్నకు మద్దతు ధర 2400 ప్రకటించిన ప్రభుత్వం.. రైతుల దగ్గర నుంచి ఇంత వరకు కొన్న పాపాన పోలేదు. నాడు జగన్ ప్రభుత్వంలో రైతులకు సకాలంలో మద్దతు ధర, ఎరువులను అందించేవారు నేడు కూటమి ప్రభుత్వంలో అధ్వాన పరిస్థితి నెలకొంది. రైతుల బీమా కోసం ఏడాదికి దాదాపు  రూ.1500 కోట్లు ఖర్చు చేశాం. ప్యాపిలిలో రూ.50 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్ మార్కెట్ ఏర్పాటు చేయడం కోసం శాంక్షన్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇటుక కూడా  వేయకుండా ఆపేశారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ ఏర్పాటు చేసింటే నేడు దళారులు వచ్చి కొనుగోళ్లు జరిపేవారు.

రైతులను పట్టించుకోకుండా ఐటీ, ఆర్టిఫీషియల్ టెక్నాలజీ అంటూ రైతుల సమస్యలను గాలికి వదిలేశారు. గత ప్రభుత్వంలో అన్నీ సౌకర్యాలు, ఏర్పాట్లు కల్పించడంతో అరటి పంట రైతులు విదేశాలకు ఎగుమతులు చేశారని స్పష్టం చేశారు. ఇప్పటికైన కూటమి ప్రభుత్వం దిగొచ్చి రైతుల పక్షాన నిలబడి గిట్టుబాటు ధరలు కల్పించాలి. రైతులకు ఎప్పుడూ అండగా ఉంటాం, రైతుల కోసం పోరాటం చేస్తాం’’ అని బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు.

Nandyala: రైతులకు సంఘీభావంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాదయాత్ర

 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)