Breaking News

జేసీబీలో వాగు దాటిన పెళ్లికుమార్తెలు

Published on Fri, 10/31/2025 - 05:40

జరుగుమల్లి(సింగరాయకొండ): ఓ పక్క దగ్గర పడుతున్న పెళ్లి ముహూర్తం...మరో పక్క గ్రామాన్ని చుట్టుముట్టిన వరద.. ఈ స్థితిలో వివాహాలు జరుగుతుందా లేదా.. అని రెండు కుటుంబాలు ఆందోళన చెందాయి. చివరకు అధికారులు చొరవ తీసుకుని జేసీబీలో ఇద్దరు పెళ్లి కూతుళ్లను ఊరు దాటించడంతో వివాహాలు జరిగాయి. 

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం సాదువారిపాలేనికి చెందిన అద్దంకి శ్రీనివాసులు, విజయల కుమార్తె దుర్గకు గురువారం ఉదయం 10 గంటలకు చినగంజాంలో వివాహం జరగాల్సి ఉంది. అదే గ్రామానికి చెందిన ఆత్మకూరి వెంకటేశ్వర్లు, అరుణ దంపతుల కుమార్తె  అంజలి వివాహం కూడా అదే గ్రామానికి చెందిన సుధాకర్‌తో సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ వరాహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సి ఉంది. 

కానీ బుధవారం సాయంత్రం నుంచి ముసి వాగు ఉగ్రరూపం దాల్చడంతో  గ్రామం నుంచి గ్రామస్తులు బయటకు అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. దీంతో రెండు కుటుంబాల వారు అధికారులకు సమస్యను వివరించారు. దీంతో అధికారులు జేసీబీల సాయంతో పెళ్లికుమార్తెలను వరద నీటిని దాటించారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)