Breaking News

రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు గంగలో కలిపారు

Published on Mon, 01/05/2026 - 03:59

ఎంవీపీ కాలనీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గంగలో కలిపే తీరును మరోసారి బట్టబయలు చేశాయని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారా­యణ పేర్కొన్నారు.  విశాఖలోని తన క్యాంప్‌ కా­ర్యా­లయంలో ఆదివారం బొత్స విలేకరులతో  మాట్లాడుతూ, ‘చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసిమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపించినట్లు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రయోజ­నాలను సీఎం చంద్రబాబు తన స్వార్థం కోసం ఎలా తాకట్టుపెడుతున్నారో స్పష్టమవుతోంది.  పై­గా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అబద్ధమంటూ ఏపీ ప్రభుత్వం లేఖ విడుదల చేయడం సిగ్గుచేటు. సూపర్‌ సిక్స్‌ హామీలు కొండెక్కడంతో రాష్ట్రంలో ప్రజా సంక్షేమం సంక్షోభంలో పడింది.  రాష్ట్రంలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు పడుతున్న కష్టాలే ఇందుకు నిదర్శనం’ అని  బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.  

జగన్‌ చొరవతోనే వేగంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం
సీఎంగా వైఎస్‌ జగన్‌ చొరవలు, విజ్ఞప్తి ప్రకారమే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పనులను జీఎంఆర్‌ సంస్థ వేగంగా పూర్తిచేసిందన్నారు. ఇందుకు ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. ‘ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణా­నికి కావాల్సిన అన్ని అనుమతులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ఇచ్చింది. శంకుస్థాపన సమయంలో తొలుత 2026 డిసెంబర్‌ నాటికి పనులు పూర్తి­చేస్తామని జీఎంఆర్‌ ప్రకటించారు.  అయితే అప్ప­టి సీఎం జగన్‌ కలుగజేసుకుని మరింత త్వరగా పనులు పూర్తిచేయ్యాలని విజ్ఞప్తి చేశారు. దానికి జీఎంఆర్‌ అంగీకారం తెలిపింది. ఎయిర్‌పోర్టు పను­లు పూర్తిచేయించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు’ అని బొత్స వివరించారు. సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అ­మర్‌నాథ్, మాజీ ఎమ్మేల్యే ధర్మశ్రీ, విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు.

ఈ ప్రశ్నలకు బదులేది?: ప్రభుత్వానికి బొత్స సూటి ప్రశ్నలు
⇒ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం తానే పూ­ర్తి­చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్న బాబు ప్రభుత్వం గంగవరం ఎయిర్‌పోర్ట్‌ ఆధునీ­కరణ పనులను ఎందుకు చేయించలేక­పోతోంది?
⇒ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌–విశాఖ సిటీ మధ్య కనెక్టివిటీ పనులు ఎందుకు వేగంగా జరగ­డంలేదు? పోర్ట్‌ టు ఎయిర్‌పోర్ట్‌ పేరు­తో జగన్‌ ప్రభుత్వం బీచ్‌రోడ్డు అభివృద్ధికి ప్రణాళికలు వేసింది.  ఆ డీపీఆర్‌కు కేంద్ర­మంత్రి నితిన్‌గడ్కారీ ఆమోదం తెలిపా­రు. అయినా ఆ పనులను ఈ ప్రభుత్వం ఇప్పటికీ  ఎందుకు చేపట్టలేకపోయింది?  

⇒ కనీస సమాచారం ఇవ్వకుండా విదేశాల­కెళ్లిన సీఎం దేశ చరిత్రలో చంద్రబాబు మి­నహా మరెవ్వరూలేరు.  రాజ్యాంగబద్ధ పదవి­లో ఉన్న ఆయన రహస్య పర్యటనకు కారణమేమిటి?
⇒ జగన్‌ జన్మదినోత్సవాన్ని వేడు­కగా జరుపు­కున్న పార్టీ కార్యకర్తలపై ‘జంతుబలి’ అంటూ కేసులు పెట్టి  రోడ్డుపై నడిపించి చిత్రహింసలు పెట్టిన పోలీసు యంత్రాంగం,  గతంలో బాలకృష్ణ సినిమా రిలీజ్‌ పోస్టర్ల ఎదుట ఇదే తీరుగా వ్యవహరించిన వారిని ఎందుకు పట్టించుకోలేదు?

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)