Breaking News

ఏమిటా రాతలు? 

Published on Mon, 03/06/2023 - 04:15

విజయనగరం: విశాఖ వేదికగా ప్రశాంత వాతావరణంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 విజయంతంగా జరిగితే ఓర్వలేని పచ్చపత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అడ్డగోలు రాతలు రాయడం దుర్మార్గమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయనగరంలో ఆదివారం జరిగిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మంచి జరిగినప్పుడు రాయకపోయినా ఫర్వా­లేదు. కానీ, చెడురాతలు రాయడం సరికాదు.

సమ్మిట్‌ ముగిసి ఒక్కరోజు కాకముందే రూ.12 లక్షల కోట్లు ఎంవోయూలు చేయడం గొప్ప కాదు... అవి ఆచరణలో చేసి చూపించగలరా... ఆరు లక్షల మం­దికి ఉద్యోగాలు కల్పించగలరా... అంటూ లెక్కలు వేసి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. వారిది నోరా.. తాటి మట్టా...’ అని బొత్స మండిపడ్డారు. ‘పచ్చపత్రికలు చెప్పిందే భగవద్గీతలా భావించే రోజులు పోయా­యి. వారేమి­చెప్పినా నిజ­మని నమ్మే పరిస్థితి లేదు.

గత టీడీపీ ప్రభుత్వ హయా­ంలో ఆర్భాటంగా నిర్వహించిన సమ్మిట్‌లపై ఎందుకు ఇలా రాయలేకపోయారు. రెండు రోజులపాటు జరిగిన విశాఖ సమ్మిట్‌కు దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సంస్థలు వచ్చిన విషయాన్ని ప్రజలు గమనించారు. ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు పరిశ్రమలు స్థాపించేందుకు పూర్తి సహకారం అందిస్తామని, దీనికోసం ప్రత్యేక కమిటీ వేస్తామని సీఎం చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి కొంత సమయం పడుతుంది. ఈలోపే ఏమిటా రాతలు? ప్రజలను తప్పుదోవ పట్టించేలా 2019 ఎన్నికలకు ముందు మీరు ఎన్ని రాతలు రాసినా ఎవరూ పట్టించుకోలేదు.

వైఎస్సార్‌సీపీని అఖండ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు...’ అని బొత్స చెప్పారు. అదేవిధంగా కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ విశాఖలో ఎన్నో వనరులు ఉన్నాయని, రానున్న రోజుల్లో మరింత అభి­వృద్ధి చెందుతుందని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ డాక్టర్‌ పెనుమత్స సురే‹Ùబాబు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)