Breaking News

కేసులను ఎదుర్కొనే దమ్ములేక మూసేయించుకుంటున్నారా?

Published on Tue, 12/02/2025 - 03:13

సాక్షి, అమరావతి: అవినీతి కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక వాటి నుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసు, తాజాగా మద్యం కుంభకోణం కేసును మూసేయించుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులైన అధికారులు కొందరిని లేని స్కాంలలో ఇరికించి.. భయపెట్టి.. ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేస్తే, మరికొందరితో కూడా అడ్డదారుల్లో ఫిర్యాదులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు.

దర్యాప్తు సంస్థలు సైతం కేసుల మూసివేతకు సహకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్‌పై ఉన్న చంద్ర­బాబు ఇలాంటి చర్యలకు పాల్పడ్డం అత్యంత దుర్మా­ర్గమన్నారు. దేశంలో ఎక్కడా ఇంతటి అధి­కార దుర్వినియోగాన్ని చూడలేదన్నారు.  తక్షణమే చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని నిలువ­రించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు చర్యలపై న్యాయపోరాటం చేస్తామని కూడా బొత్స హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలు..

కుట్రపూరితమే..
‘ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు మూసివేయిస్తున్నారు. వ్యవస్థలను కలు­షితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు.   తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకో­వడం చంద్రబాబునాయుడికి అలవాటే. అదే ఒర­వడి ఈసారి కూడా కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య చంద్రబాబు చేసిన అవినీతికి సంబంధించి పక్కా ఆధా­రాలు, సాక్ష్యాలతో పలు  కేసులు నమోదయ్యాయి. స్కిల్‌ స్కాం కేసులో ప్రాథమిక ఆధారాలు ఉండడంతో చంద్రబాబును కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌కు కూడా పంపింది.

ఆ కేసులో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారు.  ఇవికాక అసైన్డ్‌ ల్యాండ్‌ కేసు, అమరావతి రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ కేసు, ఉచిత ఇసుక పేరుతో దోపిడీచేసిన వ్యవహారంలో కేసు, ఫైబర్‌ నెట్‌లో వందలకోట్ల అవినీతికేసు సహా లిక్కర్‌ కేసులు కూడా నమోదయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ కేసుల దర్యాప్తులో పురోగతి లేదు. దర్యాప్తు సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, ప్రతి క్షణం కేసులను నిర్వీర్యం చేయ­డానికి బాబు సర్కార్‌ ప్రయత్నిస్తోంది. ఈ ధోరణిని  సహించబోము’ అని బొత్స స్పష్టం చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)