Breaking News

శాసన మండలిలో అధికారపక్షం కుప్పిగంతులు : బొత్స ధ్వజం

Published on Mon, 03/03/2025 - 14:35

సాక్షి,విజయవాడ:  దేశ చరిత్రలో సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.  సోమవారం శాసన మండలి మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు.

‘దేశ చరిత్రలో సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదు. రుషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించారు? అని ప్రశ్నించారు. రుషికొండ నిర్మాణలపై విచారణకు సిద్ధం ఉన్నామని బొత్స స్పష్టం చేశారు.  

శాసన మండలిలో అధికారపక్షం కుప్పిగంతులేసింది. సచివాలయ భవనాలపై మంత్రి అచ్చెన్నాయుడికి క్లారిటీ లేదు. తాత్కాలిక భవనాలు అని ఎప్పుడూ చెప్పలేదని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. అలాంటప్పుడు కొత్తగా నిర్మాణాలకు టెండర్లు పిలవడమెందుకు. వైఎస్సార్‌సీపీ వాళ్లకు పనిచేయొద్దని ముఖ్యమంత్రి ఎలా చెబుతారంటే సమాధానం లేదు. చంద్రబాబు మాదిరి ఇంత వరకూ ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. లబ్ధిదారుల్లో పార్టీలు చూడటమేంటి.

రుషికొండ భవనాల్లో అక్రమాలు జరిగితే ఎందుకు బిల్లులు చెల్లించారు.నిజంగా అవినీతి జరిగితే ఎంక్వైరీ వేయండి. రాజధాని కోసం సుమారు మూడు నాలుగు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది.  గతంలో టీడీపీ ప్రభుత్వం రాజధానికి రూ.6 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. బడ్జెట్ పై చర్చను డైవర్ట్ చేయడానికి టీడీపీ  సభ్యులు ప్రయత్నం చేశారు.ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాయాల్సిన అవసరం మాకేంటి. అధికారంలో ఉన్నది వాళ్లా..మేమా. ఆడలేక మద్దెల ఓడ అన్నట్లుంది కూటమి నేతల తీరు’అని మండిపడ్డారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య