Breaking News

బిహార్‌కు కేటాయింపులు.. ఏపీకి అప్పులు

Published on Wed, 07/24/2024 - 04:41

సాక్షి, అమరావతి: కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బడ్జెట్‌ ద్వారా రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేయించడంలో విఫలమయ్యారు. బిహార్‌కు మాత్రం కేంద్ర బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేయగా ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం అప్పులు ఇప్పిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. బిహార్‌కు ఒక న్యాయం ఆంధ్రప్రదేశ్‌కు మరో న్యాయం అనే రీతిలో కేంద్ర బడ్జెట్‌ ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి వివిధ డెవలప్‌­మెంట్‌ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక మద్దతుగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.15 వేలకోట్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. 

అయితే బడ్జెట్‌ డాక్యుమెంట్లలో ఎక్కడా రాజధాని కోసం కేటాయింపులు చేయలేదు. అంటే వివిధ ఏజెన్సీల ద్వారా ఇప్పించే రూ.15 వేలకోట్లు అప్పుగానే అని తేలిపోయింది. భవిష్యత్‌లో కూడా రాజధానికి అవసరమైన అప్పులు ఇప్పిస్తామని సీతారామన్‌ చెప్పారు. ప్రత్యేక ఆర్థిక మద్దతు అని పేర్కొన్నారు తప్ప ఎక్కడా గ్రాంటు, ఆర్థికసాయం అని చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఏపీకి అప్పులు ఇప్పించడానికి మాత్రమే కేంద్రం ముందుకు వచ్చిందని, ఇదే విషయాన్ని బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించి చేతులు దులుపుకొన్నారని, దీనివల్ల రాష్ట్రానికి అప్పులు తప్ప పెద్దగా ప్రయోజనం లేదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

బిహార్‌ రాష్ట్రానికి మాత్రం జాతీయ రహదారులకు ఏకంగా రూ.26 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి మాత్రం ఏజెన్సీల ద్వారా రూ.15 వేలకోట్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని పేర్కొనడం అంటే ఏపీ పట్ల చిన్నచూపు చూడటమేనని అధికార­వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో ముక్తాయింపు ఇచ్చారు తప్ప ప్రత్యేకంగా కేటా­యింపులేమీ చేయలేదు. మంత్రి ప్రసంగం నోటిమాటతో సంతృప్తి చెందాలనే చందంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. 



వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధికి సాయం కొనసాగుతుందని బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు తప్ప ఎక్కడా కేటాయింపులు చేయలేదు. ఇక గిరిజన యూనివర్సిటీకి, సెంట్రల్‌ యూనివర్సిటీకి బడ్జెట్‌లో ఏమీ ఇవ్వలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న పెట్రోలియం యూనివర్సిటీకి మాత్రం రూ.168 కోట్లు కేటాయించారు. పునర్విభజన చట్టంలోని పలు వైద్య, విద్యాసంస్ధలకు బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చేయలేదు. 

చంద్రబాబు ప్రధానమంత్రి, కేంద్ర హోం, ఆర్థిక మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్‌కు  ప్రత్యేకంగా సాయం చేయాలని కోరారు. అయినా కేంద్ర ఆర్థికమంత్రి ఏపీకి ప్రత్యేకంగా అప్పులు ఇప్పిస్తామని ప్రకటించడం గమనార్హం. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం నిబంధనలకు లోబడే ఈ అప్పును ఇప్పిస్తారా లేదా ఆ నిబంధనల మినహాయింపులతో ఇప్పిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)