Breaking News

పోరాటాలు చేసి వచ్చా.. భయపడే ప్రసక్తే లేదు: భూమన కౌంటర్‌

Published on Sun, 08/27/2023 - 12:21

సాక్షి, తిరుమల: టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై భూమన స్పందించారు. ఈ క్రమంలో తాను విమర్శలకు భయపడేవాడిని కాదని స్పష్టం చేశారు. విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. 

తాజాగా భూమన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను నాస్తికుడని విమర్శలు చేసే వారికి ఇదే నా సమాధానం. 17 సంవత్సరాల క్రితమే నేను టీటీడీ ఛైర్మన్‌ అయిన వ్యక్తిని. 30వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించాను. తిరుమల ఆలయ మాడవీధుల్లో చెప్పులతో వెళ్ల కూడదని నిర్ణయం తీసుకుంది నేనే. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు జరిపించింది కూడా నేనే. దళితవాడల్లో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం చేయించింది నేనే. నేనే క్రిస్టియన్‌ అని, నాస్తికుడని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపేవాడిని కాదు. పోరాటాల నుంచి పైకి వచ్చిన వాడిని, ఇలాంటి వాటికి భయపడను’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరోవైపు, ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి విశ్వాసాలను దెబ్బతీసేలా సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. టీటీడీ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, భక్తుల వసతుల కల్పనపై నెల రోజుల్లో ప్రదర్శన ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: సినిమా రేంజ్‌లో సీన్లు పండించిన పవన్‌.. ప్లాన్‌ బెడిసికొట్టింది!

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)