Breaking News

‘పరకామణి కేసులో డీజీ నన్ను ఈ ప్రశ్నలే అడిగారు’

Published on Tue, 11/25/2025 - 16:12

సాక్షి, తిరుపతి: పరకామణి చోరీ కేసులో వైఎస్సార్‌సీపీ కీలక నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి సిట్‌ విచారణ ముగిసింది. మంగళవారం సాయంత్రం అధికారుల ఎదుట హాజరైన ఆయన్ని 25 నిమిషాలపాటు విచారించి పంపించేశారు. అయితే.. విచారణకు హాజరయ్యే ముందు, ఆ తరవాత ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

విచారణకు ముందు.. నాకు ఈ కేసుకు  భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. కూటమి ప్రభుత్వాన్ని మోసే పిచ్చి శునకాలు అక్షరాల విరోచనాలతో తమ పత్రికను నింపేశాయి.  నన్ను ఈ కేసులో ఇరికించాలని దుష్టచతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నారా లోకేష్‌, టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు, వర్ల రామయ్య, పట్టాభిలు నన్ను కచ్చితంగా విచారణ చెయ్యాలని అధికారులపై ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి భరించలేకనే అధికారులు నన్ను పిలిచారు. అయినను పోయి రావలె హస్తినకు.. ’’ అని భూమన అన్నారు. 

విచారణ అనంతరం.. నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని ...? 15 ఏళ్లలో శ్రీ వారికి తలనీలాలు ఎంత మంది సమర్పించారూ.. అనేవిధంగా ప్రశ్నలు వేస్తే నాకు తెలియదు. పరకామణి కేసు విషయంలో నాకు అంతే తెలుసు. పరకామణి కేసులో డీజీ నన్ను ఈ ప్రశ్నలే అడిగారు. నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను అని చెప్పి వెళ్లిపోయారాయన.

నన్ను పరకామణి కేసులో ఇరికించాలని చూస్తున్నారు: భూమన

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)