Breaking News

నా తల్లి, తమ్ముడు దెయ్యాలు.. అందుకే చంపేశా..!

Published on Tue, 11/11/2025 - 13:21

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ వ్యక్తి తల్లి, సోదరుడిని చాకుతో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. సోమవారం తెల్లవారుజామున గునుపూటి మహాలక్ష్మి (60), గునుపూటి రవితేజ(33) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కూరగాయలు కోయడానికి ఉపయోగించే చాకుతో నిందితుడు గునుపూటి శ్రీనివాస్‌ వారిని కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. ఒకటో పట్టణంలోని సుంకర పద్దయ్య వీధిలో మహాలక్ష్మి, పెద్ద కుమారుడు శ్రీనివాస్, చిన్న కుమారుడు రవితేజతో కలిసి నివసిస్తుండగా, కుమార్తె బెంగళూరులో ఉంటున్నారు. మృతురాలి భర్త కోవిడ్‌ సమయంలో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. పెద్ద కొడుకు శ్రీనివాస్‌ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఇంట్లోనే ఉంటాడని, అప్పుడప్పుడూ మాత్రమే బయటకు వస్తుంటాడని చెబుతున్నారు. శ్రీనివాస్‌కు వివాహం కాలేదు. మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడమే ఈ హత్యలకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

హత్య చేసి.. 112కు ఫోన్‌ 
హత్య చేసిన అనంతరం శ్రీనివాస్‌ నేరుగా డయల్‌ 112కు ఫోన్‌ చేసి హత్య వివరాలు తెలిపాడు. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించగా.. వారిద్దరినీ తానే చంపానని, వాళ్లు దెయ్యాలని పోలీసులకు చెప్పాడు. ఇంట్లో తనను బంధించారని, తన మనసులో ఏం మాట్లాడుకుంటున్నా అది వాళ్లిద్దరికీ తెలిసిపోతోందని, ఎంత పొడిచినా వాళ్లిద్దరూ రక్తపు మడుగులో కొట్టుకోవడం చూస్తే బతికి వచ్చి మళ్లీ తనను ఇబ్బంది పెట్టేలా ఉన్నారని చెప్పాడు. అతని మాట తీరు, చెప్పిన సమాధానాలను బట్టి అతనికి మాన­సి­క పరిస్థితి సరిగా లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.   

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య