Breaking News

‘భెల్‌’ ప్రశ్నాపత్రం లీక్‌

Published on Sat, 04/12/2025 - 05:02

పెందుర్తి: విశాఖలోని పెందుర్తి సమీపంలోని జియోన్‌ టెక్నాలజీస్‌ కేంద్రంలో డబ్బులు తీసుకుని పరీక్ష జవాబు పత్రాలను లీక్‌ చేస్తోన్న బాగోతం శుక్రవారం వెలుగుచూసింది. భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌)లో సూపర్‌వైజర్‌ ట్రైనీ ఇంజినీర్‌ పోస్టుల కోసం శుక్రవారం చినముషిడివాడలోని జియోన్‌ టెక్నాలజీస్‌ ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు జరిగిన ఈ పరీక్షకు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 500 మంది హాజరయ్యారు. 

పరీక్ష కేంద్రంలో ప్రశ్నాపత్రంతోపాటు జవాబుపత్రాన్ని ముందే కొంత మంది అభ్యర్థులకు లీక్‌ చేశారు. ముగ్గురు (ప్రాథమికంగా తెలిసింది) అభ్యర్థులు 2 గంటలపాటు ఆన్‌లైన్‌లో రాయాల్సిన పరీక్షను 20 నిమిషాల్లో ముగించడంపై అనుమానం వచ్చిన తోటి అభ్యర్థులు వారిని నిలదీశారు. దీంతో వారి వద్ద అడ్మిట్‌ కార్డు వెనుక మైక్రో జెరాక్స్‌ ద్వారా తీసిన జవాబులు కనిపించడంతో మిగిలిన అభ్యర్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. పరీక్ష జరుగుతుండగానే నిర్వాహకులను నిలదీశారు. 

కాపీకి పాల్పడిన అభ్యర్థుల వద్ద జవాబు పత్రాన్ని లాక్కుని వారిని ప్రశ్నించారు. అనంతరం కేంద్రం ఎదుట నిరసనకు దిగారు. పరీక్షను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేశారు. కాగా, ఈ కేంద్రంలో జరుగుతోన్న వ్యవహారాలపై ఇది వరకే పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. 

మార్చి 25న ఇదే కేంద్రంలో జరిగిన ఏపీపీసీబీ ఏఈఈ పరీక్షలో నిర్వాహకులు అవినీతికి పాల్పడి కొందరు అభ్యర్థులకు పూర్తి సహకారం అందించారని రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే పునరావృతం అయ్యింది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.  

విద్యార్థులకు బెదిరింపులు.. 
కాపీ వ్యవహారం బయటపడడంతో పరీక్ష నిర్వాహకులు నష్ట నివారణ చర్యలకు దిగారు. సాయంత్రం పరీక్ష ముగించుకుని బయటకు వస్తున్న అభ్యర్థులను 40 నిమిషాలు కేంద్రంలోనే నిర్బంధించారు. లోపల ఏమీ జరగలేదని చెప్పాలని బెదిరించారు. బాధిత అభ్యర్థుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో తప్పనిసరి పరిస్థితిలో బయటకు పంపారు. లోపల జరిగిన విషయం బయటకు చెబితే పోలీసులతో కేసులు నమోదు చేయించి ఉద్యోగాలు రాకుండా చేస్తామని వారు బెదిరించినట్లు బాధిత అభ్యర్థులు చెబుతున్నారు.  

Videos

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

టీడీపీ నేతలకు తొడగొట్టి సవాల్ విసిరిన మహిళ.. ఇది వింటే..!

టెక్ మహీంద్రా షేర్లలో దూకుడు... 100 షేర్లకు మరో 100 ఫ్రీ

జనసేన అభ్యర్థిని చితక్కొట్టిన TDP గూండాలు

కుప్పంలో YSRCP పేరుతో TDP దొంగ నామినేషన్లు.. అడ్డంగా దొరికిపోయిన బాబు

మా పై దాడి చేస్తారా.. తేల్చుకుందాం! TDPకి జనసేన నేతలు STRONG వార్నింగ్

టికెట్లు నిల్! 70 ఏళ్ల కుర్రోడి స్టామినా.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు!

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్