Breaking News

ఆంధ్రాను అనుసరిస్తాం.. బంగ్లాదేశ్‌ బృందం ప్రశంసలు

Published on Sun, 01/21/2024 - 09:11

సాక్షి, అమరావతి: ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం, ఆహార భద్రత, మహిళా, రైతు సాధికారతకు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని బంగ్లాదేశ్‌ ప్రతిని­ధి బృందం ప్రశంసించింది. ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాల నుంచి తాము ఎంతో స్ఫూర్తి పొందామని, తమ దేశంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తామని ప్రకటించింది. ప్ర­కృతి వ్యవసా­య కార్యక్రమాల అమల్లో మహిళా సంఘాలు పోషిస్తున్న పాత్ర అద్భుతమని తెలిపింది.

రాష్ట్ర పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌ ప్రతినిధి బృందం స­భ్యులు మొహమ్మద్, రఫీకుల్‌ ఇస్లాం, తాఫిక్‌ హు­స్సేన్‌ షా చౌదురి, ఆఫ్రిన్‌ సుల్తానా, కపిల్‌కుమార్‌పాల్, శంసాద్‌ ఫర్జానా, ఏకేఎం జహీరుల్‌ ఇస్లాంలు శనివారం ఏలూరు జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. న్యూట్రీ గార్డెన్స్, కిచెన్‌ గార్డెన్స్‌ను సందర్శించారు.  పెదవేగి మండలం జ­నా­­ర్దనవరంలో మి­చాంగ్‌ తుపానుపై ఏర్పాటు చే­సిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు.

చిరుధాన్యాలు, పోషక విలువలు కలిగిన దినుసులతో తయారు చేసిన పిండి పదార్థాలతోపాటు, ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఆకుకూరలు, కాయగూరలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి, వాటి తయారీ గురించి తెలుసుకున్నారు. రైతు సాధికార సంస్థ థిమాటిక్‌ లీడ్‌ అరుణ పాల్గొన్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)