Breaking News

పేదలను బలిగొంటున్న బాబు ప్రచారార్భాటం

Published on Tue, 01/03/2023 - 08:30

తాడికొండ: తన ప్రచారార్భాటంతో పేదల ప్రాణాలను బలిగొంటున్న చంద్రబాబును తక్షణమే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల 827వ రోజు సోమవారం పలువురు మాట్లాడారు. పబ్లిసిటీ పిచ్చితో పేదలకు తాయిలాలు ఇస్తామని ఆశపెడుతూ చంద్రబాబు పెడుతున్న మీటింగులకు వెళ్లిన పేద ప్రజలు అమాయకంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధానిలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం సీఆర్డీయేకు భూములు అమ్ముకుని రిటర్నబుల్‌ ప్లాట్లు పొందిన కులవాదులు.. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం భూములిచ్చామని చెప్పడం మోసపూరితం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి చంద్రబాబు శనిలా తయారయ్యాడన్నారు. బహుజనులు 827 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే తమ పచ్చ పత్రికల్లో ప్రచురించకుండా రాష్ట్రంలో కులవాదాన్ని రెచ్చగొడుతున్న మీడియాపై చర్యల కోసం త్వరలో ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బాబు ఆయన ఎల్లో మీడియా, బినామీలు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా రాబోయే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి సత్తా చాటుతామని హెచ్చరించారు. నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)