Breaking News

ఫైబర్‌నెట్‌లోనూ బాబు మార్కు అవినీతి 

Published on Sun, 01/21/2024 - 05:27

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దోపిడీ పర్వంలో ఫైబర్‌నెట్‌ కుంభకోణం ఓ పెద్ద అధ్యాయం. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టులో పచ్చ ముఠా చేసిన అడ్డగోలు అవినీతికి నిదర్శనం.

మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలను సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) బట్టబయలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేశ్‌కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన “టెరా సాఫ్ట్‌’ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని నిగ్గు తేల్చింది. అందుకోసం టీడీపీ ప్రభుత్వం పక్కా పన్నాగంతో కథ నడిపించింది.  

పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా.. 
కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో సాధ్యమైనంత దోపిడీ చేయడానికి పక్కా ప్రణాళికే రచించారు అప్పటి ప్రభుత్వ పెద్దలు. వాస్తవంగా ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉంది. కానీ, అప్పటి సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు బాధ్యతలను విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖకు అప్పగించారు. ఎందుకంటే ఆ శాఖ చంద్రబాబు వద్దే ఉంచుకున్నారు.

చంద్రబాబు ఆయన బినామీ సంస్థ అయిన టెరాసాఫ్ట్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించడం కోసం ముందస్తు పన్నాగంతోనే టెరాసాఫ్ట్‌కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ఏపీ ఈ–గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యునిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయనను అంతటి కీలక స్థానంలో నియమించడంపై వెల్లువెత్తిన విమర్శలను కూడా పట్టించుకోలేదు.

అంతే కాదు.. నిబంధనలను ఉల్లంఘించి, ఫైబర్‌నెట్‌ టెండర్ల మదింపు కమిటీలో కూడా ఆయన్ని సభ్యుడిగా నియమించారు. ప్రాజెక్టు కోసం పోటీ పడే సంస్థకు చెందిన వారు టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదన్న నిబంధననూ చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. 

షెల్‌ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు 
చంద్రబాబు బినామీ కంపెనీ కావడంతో టెరాసాఫ్ట్‌ సంస్థఫైబర్‌నెట్‌ ప్రాజెక్ట్‌ను అత్యంత నాసిరకంగా చేసి నిధులు కొల్లగొట్టింది. టెండర్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్‌ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ నడిపించారు.

వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్‌ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే మ్యాన్‌పవర్‌ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్‌ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు.

ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్‌లతో ఆ నిధులను కొల్లగొట్టి, కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా టీడీపీ ప్రభుత్వంలో ‘ముఖ్య’నేతకు చేరినట్టు సీఐడీ గుర్తించింది. నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చింది.  

ఆధారాలతోసహా బట్టబయలు 
ఫైబర్‌నెట్‌ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ముందుగా  ఇండిపెండెంట్‌ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్‌ ద్వారా ఆడిటింగ్‌ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్‌ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్‌ నిర్ధారించింది. అనంతరం ఐపీసీ సెక్షన్లు 24, 166, 167, 418, 465, 468, 471, 409, 506, అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్‌ 13(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసింది.  

బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తొలగించి మరీ.. 
గతంలో పౌర సరఫరాల శాఖలో ఈపోస్‌ యంత్రాల సరఫరాలో విఫలమైన టెరాసాఫ్ట్‌ను ప్రభుత్వం బ్లాక్‌ లిస్టులో పెట్టింది. కానీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టును టెరాసాఫ్ట్‌కే అడ్డగోలుగా కేటాయించాలని నిర్ణయించిన చంద్రబాబు.. ఆ కంపెనీని బ్లాక్‌ లిస్టు నుంచి ఏకపక్షంగా తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేసి మరీ  టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారు. 

కేసులో ప్రధాన నిందితులు వీరే..
ఏ1:    వేమూరి హరికృష్ణ – టెరాసాఫ్ట్‌ కంపెనీ 
ఏ2:   కె.సాంబశివరావు – టీడీపీ ప్రభుత్వంలో ఇన్‌క్యాప్‌ వీసీ 
ఏ3:   టెరాసాఫ్ట్‌ కంపెనీ  
ఏ11: తుమ్మల గోపీచంద్‌ – టెరాసాఫ్ట్‌ కంపెనీ ఎండీ 
ఏ21: విజయ్‌ కుమార్‌ – డైరెక్టర్, జెమిని కమ్యూనికేషన్స్‌  
ఏ22 : రామ్‌కుమార్‌ రమణమూర్తి 
ఏ23 : కనుమూరి కోటేశ్వరరావు – డైరెక్టర్, నెటాప్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  
ఏ25: నారా చంద్రబాబునాయుడు – టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి  

రూ.114 కోట్ల ఆస్తులుఅటాచ్‌మెంట్‌ 
ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టు ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సీఐడీ  తదుపరి కార్యాచరణను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ కేసులో నిందితులకు చెందిన  రూ.114 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్‌ చేసింది. హోం శాఖ, అనంతరం న్యాయస్థానం అనుమతులు తీసుకొని ఆ ఆస్తులను అటాచ్‌ చేసింది. 

అటాచ్‌ చేసిన ఆస్తులు 
♦ నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో ఉన్న 797 చ.అడుగుల విస్తీర్ణం గల ఇంటి స్థలం 
♦ కనుమూరి కోటేశ్వరరావు డైరెక్టర్‌గా ఉన్న నెటాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌కు చెందిన కిర్లంపూడి లేఅవుట్‌లోని ఓ ఫ్లాట్‌ 
♦ టెరాసాఫ్ట్‌ కంపెనీ ఎండీ టి.గోపీచంద్‌ పేరిట హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్‌ 
♦ టి.గోపీచంద్‌ పేరిట హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలో గల రెండు ఫ్లాట్లు  
♦ తుమ్మల గోపీచంద్‌ పేరిట హైదరాబాద్‌ యూసఫ్‌గూడలో ఉన్న ఫ్లాట్‌  
♦  తుమ్మల గోపీచంద్‌ భార్య పవనదేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న వ్యవసాయ భూమి  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)