Breaking News

సోమవారం... వలంటీర్ల నిరసన వారం

Published on Tue, 10/22/2024 - 04:58

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం వలంటీర్ల నిరసన వారంగా మారిపోయింది. గత ఐదేళ్లు ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావులేకుండా ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకే చేర్చడంలో కీలకపాత్ర పోషించిన లక్షలాది మంది గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లు గత 16 వారాలుగా రోడ్డెక్కి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతోపాటు పెండింగ్‌లో పెట్టిన గౌరవ వేతనాలు చెల్లించాలని కోరుతూ ప్రతి సోమవారం అన్ని జిల్లాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ కలెక్టర్లు, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు.

ఇందులో భాగంగా ఈ వారం కూడా రాష్ట్రంలోని పలు మండలాల్లో వలంటీర్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మండల స్థాయి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యంగా విజయనగరం కలెక్టరేట్‌ ముందు వలంటీర్లు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లు నెరవేర్చాలని కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వలంటీర్లు డిమాండ్‌ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల గౌరవ వేతనాలు చెల్లించాలని నినదించారు. 

ఐదు నెలలుగా తేల్చని కూటమి సర్కారు
ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కానీ ఈ ఏడాది జూన్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఎన్నికల ముందు వరకు వలంటీర్లు నిర్వహిస్తున్న పింఛన్ల పంపిణీ సహా అన్ని విధుల నుంచి పూర్తిగా పక్కన పెట్టారు. జూలై, ఆగస్టు,సెప్టెంబర్, అక్టోబర్‌ నెలలకు సంబంధించిన గౌరవ వేతనాలను ఒక్కరికి కూడా చెల్లించలేదని వలంటీర్ల సంఘ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికైనా వలంటీర్లకు ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేయాలని వారు కోరారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)