Breaking News

బండారు శ్రావణి అనుచరుల దాడి.. పోలీసుల నిర్వాకం ఇలా..

Published on Wed, 01/28/2026 - 08:57

సాక్షి, అనంతపురం: అనంతపురంలోని శింగనమల నియోజకవర్గం యల్లనూరు పోలీసుల నిర్వాకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీ యల్లనూరు జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్‌ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో టీడీపీ నేతలను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. అయితే, వీరంతా ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు కావడమే ఇందుకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వివరాల మేరకు.. జనవరి ఒకటో​ తేదీన వైఎస్సార్‌సీపీ యల్లనూరు జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ప్రతాప్ రెడ్డి సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో యల్లనూరు టీడీపీ కన్వీనర్ రామాంజనేయులు సహా మరో 24 మంది టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు. అయితే, నిందితులంతా శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులే కావడం గమనార్హం.

కాగా, ప్రతాప్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసు నిందితులు బాహాటంగా తిరుగుతున్నా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదే కేసులో 12 మంది వైఎస్సార్‌సీపీ నేతలను మాత్రం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే బండారు శ్రావణి కార్యక్రమాల్లో టీడీపీ నేత రామాంజనేయులు, ఆయన అనుచరులు పాల్గొంటున్న వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. కేసు నమోదు చేసినప్పటికీ ఎందుకు వారిని అరెస్ట్‌ చేయడం లేదని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, స్థానికులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)